సెన్సెక్స్‌ చరిత్రలో భారీ పతనాలివీ..

2024 జూన్‌ 4 - 4390 పాయింట్లు 

సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు నమోదవ్వడం

2020 మార్చి 23 - 3935 పాయింట్లు 

కరోనా వైరస్‌ను అడ్డుకొనేందుకు లాక్‌డౌన్‌ ప్రకటన

2020 మార్చి 12 - 2919 పాయింట్లు 

మహమ్మారి కారణంగా మార్కెట్లో నెలకొన్న భయాలతో సూచీల పతనం

2020 మార్చి 16 - 2713 పాయింట్లు

కరోనా సమయంలో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లూ పతనం

2022 ఫిబ్రవరి 24 - 2702 పాయింట్లు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో మన మార్కెట్లు కుదేలయ్యాయి.

2020 మే 4 - 2002 పాయింట్లు

లాక్‌డౌన్‌ను పొడిగించడంతో స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

2020 మార్చి 9 - 1942 పాయింట్లు

కరోనా భయాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ పతనం

2021 ఫిబ్రవరి 26 - 1939 పాయింట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ పతనం

2022 ఫిబ్రవరి 14 - 1747 పాయింట్లు

రష్యా- ఉక్రెయిన్‌పై మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వాతావరణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా సూచీలకు భారీ నష్టం

2020 మార్చి 18 - 1710 పాయింట్లు

కొవిడ్‌ విజృంభణతో ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాలతో భారీగా అమ్మకాల ఒత్తిడి

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

Eenadu.net Home