విక్రాంత్‌ పాత్రలో నేనే ఉంటే..

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది శార్వరీ వాఘ్‌. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలయ్యాయి. మరో మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది.

ఆగస్టు 15న జాన్‌ అబ్రహం సరసన ‘వేద’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బీటౌన్‌లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది.

అంతకుముందు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మహరాజ్‌’లో విరాజ్‌గా మెప్పించింది. దీంతో ఈ బ్యూటీ ఫాలోయింగ్‌ కూడా పెరుగుతోంది.

‘ఇంకొకరితో పోల్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకొకరికి నన్ను ఉదాహరణగా చూపించేలా ఎదగాలనుకుంటున్నా. ఎవరి గుర్తింపు వారిదే’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అలియా భట్‌ని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదిగేందుకు కృషి చేస్తుందట. ‘విభిన్నమైన పాత్రలతో, కొత్త కొత్త నైపుణ్యాలతో అభిమానుల్ని అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా’నంటోంది. 

‘విక్రాంత్‌ మస్సే ‘12th ఫెయిల్‌’లో హీరో పాత్రలో నేను ఉంటే ఎలా ఉండేది అని ఎన్నో సార్లు ఊహించుకున్నాను. నాకు ఆ పాత్ర చేయాలనిపించింది. ఆ రోల్‌ బాగా నచ్చింది’ అని ఓ సందర్భంలో చెప్పింది.

నెట్టింట ఈ బ్యూటీ అందాల ఆరబోత, ఫొటోషూట్ల గురించి ఎప్పుడూ హాట్‌ టాపిక్‌ నడుస్తూనే ఉంటుంది. తరచూ పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇన్‌స్టాలో ఈమె పెట్టే ఫొటోలు, వీడియోలకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. శార్వరి ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 19 లక్షలకు పైమాటే!

సినిమా కోసం కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఏమాత్రం వెనకాడదీమె. ‘వేద’ కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంది.

పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈమె ప్రత్యేకమైన అభిరుచుల్ని ఏర్పరుచుకుంది. స్నేహితులతో కలిసి మట్టితో కళాకృతులు చేస్తుంది. ఇది తనకెంతో సంతోషాన్నిస్తుందట.

‘అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడక తప్పదు మరి. నేను ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ సమయం వ్యాయామానికే కేటాయిస్తాను’ అంటూ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ని బయటపెట్టిందీ భామ.

ప్రస్తుతం ‘ఆల్ఫా’లో అలియా భట్‌తో కలిసి శార్వరి నటిస్తోంది. ఇందులో బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని శివ్‌ రావైల్ తెరకెక్కిస్తున్నారు.

అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

ఇండియన్‌ సినిమా: రూ.1000+ కోట్లు వసూళ్ల చిత్రాలివే

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

Eenadu.net Home