శివుడు లింగ రూపంలో ఎందుకు ఉంటాడో తెలుసా!

image:RKC

కార్తికమాసంలో శివుడిని కొలిచి, ప్రత్యేక పూజలెన్నో చేస్తారు. ఏ శైవ దేవాలయం వెళ్లినా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఎందుకో తెలుసా...?

image:RKC

దేశంలోని హిందూ దేవాలయాల్లో శివుని ఆలయాలే అధికంగా ఉంటాయి. శివలింగం ఒక పవిత్ర చిహ్నం. దీన్ని శక్తి సూచికగా గుర్తిస్తారు.

image:RKC

అత్యంత పవిత్రమైన వాటిలో జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి. జ్యోతిర్లింగమంటే శివుని ప్రకాశవంతమైన గుర్తని చెబుతారు.

image:RKC

వరాహపురాణంలో శివుడిని లింగరూపంలో పూజించడానికి గల కారణాలను వివరించారు. వేంకటేశ్వరస్వామి అవతారానికి సంబంధించినవి కూడా ఈ గాథలో పేర్కొన్నారు.

image:RKC

భృగు మహర్షి శివుడి దగ్గరకు వచ్చినా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. ఇప్పటి నుంచి శివలింగానికి తప్ప నీ విగ్రహానికి పూజలుండవని శపిస్తారు.

image:RKC

అంతకు ముందు శివుడికే పూజలందేవని పురాణాలు చెబుతున్నాయి. ఆ శాపంతోనే లింగ రూపాన్ని పూజించే ఆచారం మొదలయ్యింది.

image:RKC

జనన మరణాలకు అతీతుడైన శివుడిని దేవతలందరూ పూజిస్తారు.

image:RKC

శివ లింగాలను ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా సరైన రాతితో లేదా ఇతర పదార్థాలతో నిర్మిస్తారు.

image:RKC

ఏప్రిల్‌ 21.. మహావీర్ జయంతి

ఈ వారం రాశిఫలం

నూతన సంవత్సరం ఒక్కో చోట ఒక్కోలా..

Eenadu.net Home