చై- శోభితల ప్రేమ ప్రయాణం: పెళ్లి పనులు స్టార్ట్‌

అక్కినేని నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు ప్రారంభించారు. గోధుమరాయి, పసుపు దంచడంతో పనులు మొదలయ్యాయి అని శోభిత సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

చైతు - శోభిత ప్రేమప్రయాణం ఆగస్టు 8న నిశ్చితార్థంతో పెళ్లి బంధం వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. 

తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన శోభితకు సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఇష్టం. పెళ్లి అలానే చేసుకోవాలని అనుకుంటోంది.

గోధుమ రాయి, పసుపు దంచడం కార్యక్రమంలో భాగంగా శోభిత, కుటుంబ సభ్యులు రోకలి, తిరగలిని పూజించి, పెళ్లి పనులు మొదలు పెట్టారు. 

చాలా కాలం క్రితం నుంచే శోభిత, చైతన్య రిలేషన్‌లో ఉన్నట్టు నెట్టింట వార్తలు వచ్చాయి. దీనికి కారణం అప్పుడప్పుడూ వైరల్‌ అయిన ఫొటోలే.

గత సంవత్సర కాలంలో విదేశాల్లో ట్రిప్పులు, షాపింగ్‌లు, పార్టీలు.. వారి బంధాన్ని ప్రపంచానికి చెప్పాయి. 

‘మేజర్‌’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నాగచైతన్యను శోభిత కలిసింది. తన పుట్టిన రోజు వేడుకలో స్నేహితులతో పాటు వచ్చిన చైతో పరిచయం ఏర్పడింది. అలా స్నేహితులయ్యారు. 

ఇటీవల ఇద్దరూ దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అయింది. ‘ఏదైనా ఎక్కడైనా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది’ అని ఆ ఫొటోకి క్యాప్షన్‌ ఇచ్చాడు చై.

పెళ్లి విషయానికొస్తే... రాజస్థాన్‌లో కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య జరగనుందని వార్తలు వస్తున్నాయి.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home