మణిరత్నం సినిమా.. రెహమాన్‌ సంగీతం.. ఇవి చాలు!

‘మెకానిక్‌ రాకీ’లో విశ్వక్‌సేన్ సరసన అలరించనుంది శ్రద్ధా శ్రీనాథ్‌. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్‌ గురించి ఆసక్తికర విషయాలు.. 

‘జెర్సీ’తో తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ‘జోడి’,‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాలతో మెప్పించింది.

జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో జన్మించింది శ్రద్ధా శ్రీనాథ్‌. తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చాలా రాష్ట్రాలతో ఆమె జీవిత ప్రయాణం సాగింది. 7-10th క్లాస్‌ వరకు సికింద్రాబాద్‌లో చదువుకుంది. 

బెంగళూరులో ఎల్‌ఎల్‌బీ చదివి, కార్పొరేట్‌ లాయరుగా పని చేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

‘జెర్సీ’ సమయంలో ‘కెరీర్‌ ప్రారంభంలోనే తల్లిగా నటించడం అవసరమా?’ అనే ప్రశ్న ఎదుర్కొంది. అయితే కథ నచ్చడంతో వెనకడుగు వేయలేదని ఓ సందర్భంలో చెప్పింది. 

బెంగళూరు వీధుల్లో దొరికే పఫ్‌ అంటే ఇష్టపడుతుంది. ‘అమ్మతో కలసి షాపింగ్‌కి వెళ్లినప్పుడు తప్పక తింటా’ అని చెప్పింది. 

నటనతో పాటూ.. వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. చెన్నైలో జిమ్‌, యోగా సెంటర్లకు దగ్గరగా సలాడ్‌ స్టాల్స్‌ను తెరిచింది. 

తన దుకాణాల్లో సలాడ్స్‌కి ఉపయోగించే పళ్లూ, కాయగూరలను నేరుగా రైతుల నుంచి సేకరిస్తుంది ఆమె సంస్థ. అలా వారికి నేరుగా ఉపాధిని కల్పిస్తోంది.

ఫారిన్‌ ట్రిప్‌ అంటే లండన్‌ సిటీకే ఓటేస్తుంది. టైమ్‌ దొరికితే అక్కడ వాలిపోతుంటుంది. 

మణిరత్నం - ఏఆర్‌ రెహమాన్‌ కాంబినేషన్‌లో సినిమా తీస్తే.. అందులో పని చేయాలనేది తన కోరిక అని చెప్పింది శ్రద్ధ.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home