బలమైన కథల్లో అందాల తార!

శ్రియ సరన్‌.. టాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌. అగ్ర కథానాయకులందరితో నటించి మెప్పించింది.

Image: Instagram/Shriya Saran

తాజాగా పాన్‌ ఇండియా సినిమా ‘కబ్జ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Image: Instagram/Shriya Saran

ఉపేంద్ర, కిచ్చ సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కబ్జ’ తాజాగా విడుదలై హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో శ్రియ కీలక పాత్ర పోషించింది.

Image: Instagram/Shriya Saran

శ్రియ.. 2018లో వివాహం చేసుకున్నా.. సినిమాలకు గ్యాప్‌ రాకుండా చూసుకుంది. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, 2020లో వచ్చిన హిందీ చిత్రం ‘సబ్‌ కుశల్‌ మంగళ్‌’లో అతిథి పాత్రల్లో కనిపించింది.

Image: Instagram/Shriya Saran

పెళ్లయిన తర్వాత శ్రియ.. మునపటిలా గ్లామర్‌ పాత్రల్లో కాకుండా బలమైన పాత్రలు పోషించేందుకు మొగ్గుచూపుతోంది.

Image: Instagram/Shriya Saran

ఆమె నటించిన ‘గమనం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

Image: Instagram/Shriya Saran

బాలీవుడ్‌లోనూ ఇదే పంథాను కొనసాగిస్తూ.. ‘తడ్కా’, ‘దృశ్యం 2’లో నటించింది. ప్రస్తుతం ‘మ్యూజిక్‌ స్కూల్‌’ చిత్రంలో నటిస్తోంది.

Image: Instagram/Shriya Saran

మహిళల కోసం మంచి పాత్రలు సృష్టించాలంటే.. తెర ముందే కాదు, తెర వెనుక కూడా మహిళలు ఉండాలి అని అంటోంది శ్రియ. 

Image: Instagram/Shriya Saran

సినిమాలో గ్లామర్‌ పాత్రలు చేయకున్నా.. సోషల్‌మీడియాలో మాత్రం తన అందంతో అభిమానుల్ని, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Shriya Saran

తరచూ ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ తన వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తోంది. ఇన్‌స్టాలో ఆమెను 4.1 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Image: Instagram/Shriya Saran

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home