విజయ్‌ మాల్యాకు కాబోయే కోడలు.. ఎవరీ జాస్మిన్‌?

భారతీయ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి, తన ప్రేయసి జాస్మిన్‌ గురించి కొన్ని సంగతులు చూద్దాం..

సిద్ధార్థ్‌ మాల్యా అలియాస్‌ సిద్‌ మాల్యా అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జన్మించాడు. వెల్లింగ్టన్‌ కాలేజ్‌, క్వీన్స్‌మేరీ విశ్వవిద్యాలయాల్లో (యూకే) చదువుకున్నాడు.

రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామాలో కోర్సు చేశాడు. అనంతరం మోడల్‌, యాక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. ‘బెస్ట్‌ ఫేక్‌ ఫ్రెండ్స్‌’ తదితర చిత్రాల్లో నటించాడు.

మానసిక ఆరోగ్యంపై పుస్తకాలు కూడా రాశాడు. యువతలో వచ్చే మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాడు. తాను జీవితంలో అనుభవించిన మానసిక పరిస్థితిపై కూడా ఓ పుస్తకం రచించాడు. 

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ది హంట్‌ ఫర్‌ ది కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ గర్ల్‌ 2013కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే సిద్‌ గతంలో నిర్వహించిన ముంబయి మారథాన్‌లో రెండుసార్లు, లండన్‌ మారథాన్‌, దిల్లీ హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నాడు. 

అమెరికాకు చెందిన జాస్మిన్‌ కూడా ఒకప్పుడు మోడల్‌. ప్రస్తుతం సాహస యాత్రకురాలిగా కొనసాగుతున్నారు. 

జాస్మిన్‌ జంతుప్రేమికురాలు. పెంపుడు జంతువులంటే అమితమైన ప్రేమ.

 పౌర హక్కులు, మానవతా చట్టాల గురించి పోరాడే ‘సీజ్‌ఫైర్‌ సెంటర్‌ ఫర్‌ సివిలియన్‌ రైట్స్‌’ను ఆమె సపోర్ట్‌ చేస్తోంది. అమెరికాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తోంది.

 ఎప్పటి నుంచో స్నేహితులైన వీరిద్దరు.. తమ బంధం అంతకుమించిందని పరోక్షంగా 2022 క్రిస్మస్‌ సమయంలో ఈ ఫొటో ద్వారా తెలిపారు. అప్పటి నుంచీ తాము కలిసి ఎక్కడ ఫొటో దిగినా వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు.

గతేడాది లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన హాలోవీన్‌ వేడుకల్లో.. మోకాలిపై కూర్చొని సినిమాటిక్‌ స్టైల్‌లో జాస్మిన్‌కు ప్రపోజ్‌ చేశాడు సిద్‌.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home