అతి ‘టీ’ అనర్థమే!

చాలా మందికి టీ/కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఒక రోజులో 3 కప్పుల టీ తాగితే ఫర్వాలేదు. కానీ, అంతకుమించి తాగితేనే ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

Image: Unsplash

రక్తహీనత


టీలో టాన్నిన్స్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ఐరన్‌ శరీరానికి అందకుండా చేస్తుంది. దీంతో రక్తహీనత ఏర్పడుతుంది.

Image: Unsplash

ఆందోళన


టీలోనూ కెఫెన్‌ ఉంటుంది. మనం తాగే టీలో కెఫెన్‌ మోతాదుకు మించి ఉంటే ఆందోళన, చంచలత్వం వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.

Image: Unsplash

నిద్రలేమి


అతిగా టీ తాగితే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. టీలో ఉండే కెఫెన్‌ శరీరాన్ని నిద్రపుచ్చే మెలటోనిన్‌ హార్మోన్‌ను అణిచివేస్తుంది. దీంతో నిద్రపట్టదు.

Image: Unsplash

వికారం/వాంతులు


టీలో ఉండే కొన్ని రకాల పదార్థాలు వికారం లేదా వాంతులకు కారణమవుతాయి. అతిగా లేదా పరగడుపున టీ తాగడం వల్ల ఇలా జరిగే అవకాశముంది.

Image: Unsplash

గుండెల్లో మంట


టీలో ఉండే కెఫెన్‌ వల్ల ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఎసిడిటీ, గ్యాస్‌ సమస్యలు వస్తాయి. గుండెల్లో మంటగా అనిపించొచ్చు.

Image: Unsplash 

గర్భస్రావం


అతిగా టీ తాగే గర్భిణుల్లో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని, బిడ్డ పుట్టినా తక్కువ బరువుతో అనారోగ్యంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image: Unsplash

వ్యసనం


టీలోని కెఫెన్‌ ఓ మత్తుపదార్థం. అది టీ తాగడాన్ని ఒక వ్యసనంగా మార్చేస్తుంది. టీ తాగకపోతే తలనొప్పి, చిరాకు, హృదయ స్పందన తీవ్రమవడం వంటివి మొదలవుతాయి.

Image: Unsplash

క్యాన్సర్‌


రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముంది.

Image: Unsplash

దానితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

తీపి తినాలన్న కోరికను ఇలా అదుపు చేయండి..

ఈ ఆహారం వల్లే ఒత్తిడికి లోనవుతున్నారేమో చూడండి...

Eenadu.net Home