వ్యాయామం మితిమీరితే ముప్పే!

వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. కండలు పెరుగుతాయి. అదే వ్యాయామం మితిమీరితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image: Unsplash

అతిగా వ్యాయామం చేస్తే కండలు పెద్దగా కనిపించొచ్చు కానీ, శరీరంలో ఫిట్‌నెస్‌ ఉండదు.

Image: Unsplash

వ్యాయామం చేస్తే మొదట్లో కండరాల నొప్పులు రావడం సహజం. అవి తొందరగానే తగ్గిపోతాయి. వారం దాటినా తగ్గకపోతే అతిగా వ్యాయామం చేస్తున్నట్లే. ఇవి దీర్ఘకాలం ఇబ్బంది పెడతాయి.

Image: Unsplash

అతిగా వ్యాయామం చేసినప్పుడు శరీరం ఎక్కువ అలసటకు గురై.. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

Image: Unsplash

ఎముకలు ధృడత్వాన్ని కోల్పోయి, పెళుసుగా మారే ప్రమాదం ఉంది.

Image: Unsplash

వ్యాయామం అతిగా చేస్తే కార్టిజోల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ మోతాదులు పెరుగుతాయి. ఈ హార్మోన్‌ జీవక్రియలపై ప్రభావం చూపించడంతో బరువు పెరుగుతారు.

Image: Unsplash

మితిమీరిన వ్యాయామం.. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చురుకుదనం తగ్గి.. కోపం, మొండితనం పెరుగుతాయి. ఆందోళన, కుంగుబాటుకు గురయ్యే ప్రమాదముంది.

Image: Unsplash

అతిగా వ్యాయామం చేయడం వల్ల నాడీ వ్యవస్థ సరిగా పనిచేయదు. రాత్రుళ్లు నిద్ర పట్టదు.

Image: Unsplash

వ్యాయామం ఎక్కువ చేసి విశ్రాంతి తీసుకున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవచ్చు. ఈ క్రమంలో గుండె సమస్యలు తలెత్తొచ్చు.

Image: Unsplash

మహిళల్లో అయితే.. అతి వ్యాయామం రుతుక్రమంపై ప్రభావం చూపే అవకాశముంది.

Image: Unsplash

చెరకు రసం ప్రయోజనాలేంటో తెలుసా?

ఇంటికి దిష్టి.. ఒంటికి పుష్ఠి

అతిగా ఆలోచించకండి..

Eenadu.net Home