‘సింహాద్రి’ రీ రిలీజ్.. మీకివి తెలుసా?
ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం.. సింహాద్రి.
Image: Twitter
ఈ చిత్రం జులై 9, 2003న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మే 20న 4K ఫార్మాట్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు.
Image: Twitter
ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్స్‌పై సినిమా ప్రదర్శితంకానుంది. మెల్‌బోర్న్‌లోని భారీ ఐమాక్స్ తెరపై ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
Image: Twitter
తాజాగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఓ రీ రిలీజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి.
Image: Twitter
ఇప్పటికే అన్ని చోట్ల ఈ సినిమా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. జపాన్‌లో ఏకంగా 1 మిలియన్‌కుపైగా టికెట్లు బుక్ అయ్యాయి.
Image: Twitter
రీ రిలీజ్ ద్వారా వచ్చే వసూళ్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ అభిమానుల కోసం ఖర్చు చేయనున్నారట.
Image: Twitter
నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘సింహాద్రి’ కథ రాశారట. కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ చేయకపోవడంతో ఎన్టీఆర్ నటించారు.
Image: Twitter
ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రథమార్ధంలో సింహాద్రిగా, ద్వితీయార్ధంలో కేరళ నేపథ్యంలో సాగే బ్యాక్‌డ్రాప్‌లో సింగమలైగా కనిపిస్తారు.
Image: Twitter
ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Image: Twitter
ఈ చిత్రంలో ఎన్టీఆర్ వాడే ఆయుధం సినిమాకి ఓ బ్రాండ్‌గా నిలిచింది. అప్పటినుంచే రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలో ఓ ప్రత్యేకమైన ఆయుధం ఉండటం సెంటిమెంట్‌గా మారింది.
Image: Twitter
అప్పట్లో తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 155 సెంటర్లలో 100 రోజులు, 52 సెంటర్లలో 175 రోజులు ఆడింది.
Image: Twitter