కడుపు ఉబ్బరంగా ఉందా? ఇలా తగ్గించుకోండి!

పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తినాలి. తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, పప్పులు, నట్స్‌, గింజల్లో.. పీచు అధికంగా ఉంటుంది.

Image:Eenadu

ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి క్రమంగా కడుపుబ్బరం, పొట్ట ఎత్తు కూడా తగ్గిపోతాయి.

Image:Pixabay

సమయం లేదనో, ఇతర కారణాలతో కొంతమంది గబగబా భోజనం చేసేస్తుంటారు. కడుపులో గ్యాస్‌, ఉబ్బరానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా తినాలి.

Image:Pixabay

కడుపులోని మంచి బ్యాక్టీరియా ఉబ్బరాన్ని తగ్గిస్తుందట! ఇందుకోసం ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉండే పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Image:Pixabay

పెప్పర్‌మింట్‌ టీ, అల్లం టీ, పైనాపిల్‌, ఆకుకూరలు.. వంటివి కడుపుబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మితంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Image:Pixabay

శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ, కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ. కాబట్టి వంటకాల్లో ఉప్పు తగ్గించడంతోపాటు నీళ్లు ఎక్కువగా తాగాలి.

Image:Pixabay

కొన్ని రకాల కూల్‌ డ్రింక్స్‌ తాగినప్పుడు కూడా కడుపు ఉబ్బరానికి గురవుతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Image:Unsplash

పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తింటే కొంతమంది కడుపుబ్బరానికి గురవుతుంటారు. కాబట్టి ఈ పదార్థాల్ని మితంగా తీసుకోవడం మంచిది.

Image:Pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home