వన్ ఉమెన్ బ్యాండ్..
జస్లిన్ రాయల్
ఇండస్ట్రీలో కొద్దిమంది మహిళలే సింగర్ కమ్ యాక్టర్స్‌గా ఉన్నారు. వారిలో ‘హీరియే’ ఫేమ్ సింగర్ జస్లిన్ రాయల్ ఒకరు.
‘సాహిబా’ మ్యూజిక్ ఆల్బమ్‌తో జస్లిన్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ పాటకి మ్యూజిక్ కంపోజర్‌గానే కాకుండా రీసెర్చర్‌గానూ పనిచేసింది.
హిందీ, ఇంగ్లిష్, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో పాడి వివిధ అవార్డులను అందుకుంది జస్లిన్ రాయల్.
2014లో ‘ఖూబ్ సూరత్’లో ‘ప్రీత్’ అనే పాటతో హిందీ సినిమాకు సింగర్‌గా పరిచయమైంది.
అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని జస్లిన్ పంజాబ్‌లోని లుథియానాలో స్కూల్ విద్యను, దిల్లీలో బీకామ్ పూర్తి చేసింది.
అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, హన్సిక వంటి సెలబ్రిటీల పెళ్లి ఆల్బమ్స్‌కు స్వరాలు అందించింది.
చిన్నతనం నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతో శిక్షణ లేకుండా ‘ఇండియా గాట్ టాలెంట్’ ఫైనలిస్ట్‌లో ఒకరిగా నిలిచింది.
జస్లిన్ పాడుతూ.. గిటార్, కీబోర్డ్, మౌత్ ఆర్గాన్, ఫ్లూట్, తంబుర వంటి వాయిద్యాలను ప్లే చేయగలదు. అందుకే ‘వన్ ఉమెన్ బ్యాండ్’ అనే పేరు సంపాదించుకుంది.
జస్లిన్ మొదటిసారి కంపోజ్ చేసిన ‘పాంచి హో జావా’ పాటకు బెస్ట్ ఇండీ సాంగ్ అవార్డు దక్కింది.
This browser does not support the video element.
మైక్ పట్టుకుని స్టేజ్ మీద ఉన్నా.. మేకప్ వేసుకుని కెమెరా ముందు ఉన్నా.. ‘గెట్ రెడీ..’ అనేది ఆమె నినాదం.
‘షేర్షా’ మూవీకి ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డు తీసుకున్న తొలి మహిళ కూడా ఆమెనే.
నా కొత్తసాంగ్ వచ్చిన ప్రతిసారి నాన్న రింగ్‌టోన్ మారుస్తాడు.. అది నాకు నచ్చుతుందని చెప్పింది.