కంగన రియల్ రోల్స్
#ఈనాడు
ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా వచ్చిన ‘తలైవి’లో కంగన లీడ్ పోషించారు. విజయ్ దర్శకుడు. 2021లో ఇది విడుదలైంది.
ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా కంగన నటించిన చిత్రం ‘మణికర్ణిక’. కంగన, క్రిష్ దర్శకత్వంలో ఇది సిద్ధమైంది. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘రంగూన్’. బాలీవుడ్‌లో పేరుపొందిన స్టంట్ ఉమెన్, నటి ఫియర్‌లెస్ నదియా పాత్రకు స్ఫూర్తిగా కంగన రోల్ క్రియేట్ చేశారు.
యూఎస్‌లో నాలుగు బ్యాంకులు దోచుకున్న మహిళ సందీప్ కౌర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సిమ్రన్’. ఇందులో కంగన టైటిల్ రోల్ పోషించారు.
2016లో కంగన నటించిన చిత్రం ‘వోహ్ లమ్హే’. ఇందులో ఆమె బాలీవుడ్ నటి సనా అజీమ్ పాత్రను పోషించారు.