స్కిప్పింగ్‌ చేస్తారా..? ఇది ఆట కాదు.. ఆరోగ్యం!

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఇందుకోసం జిమ్‌కెళ్లి కసరత్తులు చేయొచ్చు.. జాగింగ్‌, సైక్లింగ్‌, యోగా చేయొచ్చు. అవీ కుదరకపోతే ఇంట్లోనే కాసేపు స్కిప్పింగ్‌ చేయండి.. దీంతోనే ఫిట్‌గా మారొచ్చు. 

image:unsplash

రోజులో కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేస్తే వాకింగ్‌ చేస్తే కరిగే కెలోరీలకన్నా రెండింతలు కరిగిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనముంటుంది.

image:pexels

తాడట 20 నిమిషాలు ఆడితే 200+ కెలోరీలు ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఆడితే వేగంగా బరువు తగ్గొచ్చు.

image:pexels

స్కిప్పింగ్‌ చేస్తున్నప్పుడు శరీర పైభాగం వేగంగా కదులుతూ.. గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో హృదయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

image:rkc

ఈ ఆటతో శారీరకంగానే కాదు, మానసికంగానూ లాభాలున్నాయి. ఏకాగ్రతతో ఆడతాం కాబట్టి మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

image:rkc

గెంతేటప్పుడు ఎంత సమయంలో వేగంగా గెంతాలనే దానిపై మనం దృష్టి పెడతాం. దీంతో అన్ని విషయాల్లో వేగంగా స్పందించడం అలవడుతుంది.

image:pixabay

ఇంతకు ముందు కాస్త దూరం నడిచినా అలసటగా అనిపించే వారికి స్కిప్పింగ్‌ చేయడం అలవాటయ్యాక వేగంగా, సునాయసంగా ఎంత దూరమైనా నడవగలరు.

image:rkc

తాడట ఆడటం వల్ల చెమట పడుతుంది. దీంతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకుపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

image:rkc

చిన్నారులు స్కిప్పింగ్‌ చేస్తే శరీరం సాగి పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

image:pexels

స్కిప్పింగ్‌ చేశాక ఊపిరి వేగంగా తీసుకుంటాం. దానితో కడుపు పైభాగాన ఉండే కొవ్వు కరిగిపోతుంది. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

image:unsplash

ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అలాగని ఆపకూడదు. తక్కువ సమయంతో మొదలుపెట్టి.. క్రమంగా పెంచుతూ పోవాలి. ఇలా చేస్తే నొప్పులుండవు. 

image:pexels

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

రెయిన్‌బో డైట్‌ లాభాలివీ..!

రకరకాల పండ్లతో.. అనేక లాభాలు

Eenadu.net Home