పొగాకు యాడ్ పాప గుర్తుందా..
ఏ హీరో సినిమా అయినా.. ఈ పాప మాత్రం ఉండాల్సిందే. సినిమాకి ముందుగా వేసే పొగాకు యాడ్‌లో ఉండే అమ్మాయిని చూసే ఉంటారు.. తనే సిమ్రాన్ నటేకర్.. ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి..
ఆ చిన్నారి ఇప్పుడు టీవీల్లోకి నటిగా వచ్చేసింది. బాలీవుడ్‌లో ‘బంధన్ సాత్ జన్మో కా’ అనే సీరియల్ ద్వారా 2009లో బుల్లితెరపై తెరంగేట్రం చేసింది.
1997లో ముంబయిలో పుట్టి పెరిగింది సిమ్రాన్. ఆరేళ్ల వయసులో పొగాకు ప్రకటనలో కనిపించిన ఆ చిన్నారి ఆ తర్వాత దాదాపు 150 ప్రకటనలు చేసింది.
‘జన్నె ఖాన్ సే ఆయి హై’, ‘క్రిష్ 3’, ‘దావత్ ఏ ఇష్క్’ తదితర చిత్రాల్లో నటిగా చిన్న పాత్రల్లో మెప్పించింది.
సీరియల్స్‌లోనూ నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నసిమ్రాన్.. 2015లో చేసిన ‘చిన్నారి పెళ్లికూతురు’తో ఫేమసైంది.
‘లవ్ యూ జిందగీ’, ‘తోట వెడ్స్ మైనా’, ‘దేవోన్ కా దేవ్ మహాదేవ్’, ‘ఓయ్ జెస్సీ’, ‘పెహరేదర్ పియా కీ’, ‘ఇంటర్నెట్ వాలా లవ్’ తదితర సీరియల్స్‌తో అలరించింది.
‘జై శ్రీ క్రిష్’ చిత్రం, ‘గర్ల్స్ హాస్టల్’ అనే వెబ్ సిరీస్‌తో ఇటీవల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఇప్పుడు టాలీవుడ్‌లోనూ నటించే ప్రయత్నాలు చేస్తోంది సిమ్రాన్. తెలుగు సినిమా ఆడిషన్స్ ఇస్తోందట. త్వరలో టాలీవుడ్‌లో నటిస్తానని బలంగా చెబుతోంది.
సిమ్రాన్‌కి ట్రావెలింగ్ అంటే ఇష్టమట. కొత్త ప్రదేశాలు సందర్శిస్తూ అక్కడ దొరికే ప్రత్యేక వస్తువులని కూడా తెచ్చుకుంటుందట. ముఖ్యంగా ఇటలీ అంటే బాగా నచ్చుతుందట.
సిమ్రాన్ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటుంది. దాదాపుగా 2.8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
(photos:instagram)