17 ఏళ్లకే యూట్యూబ్‌ ఛానల్‌.. వీడియో పెడితే లక్షల్లో వ్యూస్‌

ప్రభాస్‌- హను రాఘవపూడి కాంబోలో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. 

ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈలోపే ఈ సినిమాలో కథానాయిక గురించి అప్పుడే నెట్టింట చర్చ మొదలైంది.

ప్రభాస్‌ సరసన ఇమాన్వీ ఎస్మాయిల్‌ను హీరోయిన్‌గా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఎవరీ బ్యూటీ అంటూ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 

1995లో దిల్లీలో పుట్టిన ఇమాన్వీ చదువులో టాపర్‌. ఎంబీఏ పూర్తి చేసింది. 12 ఏళ్ల వయసులోనే డ్యాన్స్‌పై ఉన్న ఇష్టంతో నృత్యంలో ప్రావీణ్యం సంపాదించింది.

2012లోనే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. డ్యాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటుంది. ఓ పక్క చదువు కొనసాగిస్తూనే.. డిజిటల్‌ మీడియాలో పేరు సంపాదించుకుంది.

నెట్టింట ఈమె అప్‌లోడ్‌ చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తాయి. యూట్యూబ్‌లో ఈ బ్యూటీ ఛానల్‌కు 18 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 

పలు బాలీవుడ్‌ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసింది. కళ్లతోనే నాట్యమాడే ఇమాన్వీ.. చిత్రపరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా, నటిగా, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఈమె ఇన్‌స్టాఖాతా నిండా డ్యాన్స్‌ వీడియోలే ఉంటాయి. ఫుల్‌ గ్రేస్‌తో ఈ బ్యూటీ వేసే స్టెప్పులు చూసిన ఎవరైనా కాలు కదపకుండా ఉండలేరు మరి! 

ఈమెకి బీచ్‌లో సమయం గడపడం అంటే చాలా ఇష్టం. ‘వచ్చీ పోయే అలల్ని చూస్తూ కూర్చుంటే ఎంత సమయం అయినా తెలీదు’ అంటోందీ బ్యూటీ.

This browser does not support the video element.

డ్యాన్స్‌ ఎంత సేపు చేసినా ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళుతుందట. అక్కడ కూడా స్నేహితులతో సరదాగా స్టెప్పులు వేయిస్తుంటుంది.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home