యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

యూట్యూబర్‌ నిహారిక ఎన్‌ ఎమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులరైన ఈమె తాజాగా కేన్స్‌ 77వ చిత్రోత్సవంలో పాల్గొని వార్తల్లో నిలిచింది.

భారత్‌ నుంచి కంటెంట్ క్రియేటర్ల జాబితాలో నిహారిక కేన్స్‌కు హాజరైంది. నేవీ బ్లూ కలర్‌ నెట్టెడ్‌ ట్రాన్స్‌పరెంట్‌ డ్రెస్‌ ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది.

కేన్స్‌లో ఈ భామ సోయగం చూసి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ నిహారిక లుక్స్, ఆమె ధరించిన డ్రెస్సు హాట్‌ టాపిక్‌గా మారాయి.

This browser does not support the video element.

సినిమాల విడుదల సమయంలో నటులతో ఈమె వీడియోలు చేస్తుంటుంది. మహేశ్‌బాబు, ఆమిర్‌ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, విజయ్‌ దేవరకొండ, రణ్‌బీర్‌ కపూర్‌ తదితరులతో వీడియోలు రూపొందించింది. వాటికి లక్షల్లో లైకులొచ్చాయి. 

నటులతోనే కాదు.. క్రికెటర్లు, వివిధ రంగాల్లో ప్రముఖులతోనూ నిహారిక రీల్స్‌, ఇంటర్వ్యూలు చేస్తోంది . విహారయాత్రలకు వెళ్తే ట్రావెల్‌ వ్లాగ్‌ చేస్తుంటుంది.

This browser does not support the video element.

క్రికెటర్‌ శుభమన్‌ గిల్‌తో చేసిన డేట్ వీడియో అయితే.. చెప్పనవసరమే లేదు. ఫుల్‌గా వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు, లైకులు ఓ రేంజ్‌లో వచ్చాయి.

మొదట్లో ఈమె అకౌంట్‌కు పెద్దగా ఫాలోవర్స్‌ ఉండేవాళ్లు కాదు.. ఎప్పుడైతే సెలబ్రిటీలతో వీడియోలు చేయడం మొదలుపెట్టిందో.. అప్పటి నుంచి ఫాలోవర్స్‌ భారీగా పెరిగారు. కేవలం రెండు నెలల వ్యవధిలో లక్ష ఫాలోవర్స్‌ కాస్త.. కోట్లకు చేరారు. 

 తన టాలెంట్‌తో సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం ఈమె యూట్యూబ్‌ ఛానెల్‌కు 2.82 మిలియన్‌ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇన్‌స్టా ఖాతాను 3.4 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.  

నిహారిక కుటుంబానిది బెంగళూరు. కానీ, చెన్నై(1997)లో పుట్టింది. ఎంబీఏ పూర్తి చేసింది. ఫస్ట్‌ ర్యాంక్‌ స్టూడెంటే అయినా, స్కూలుకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు.

కాలేజీలో ఉన్నప్పుడే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. కామిక్‌ వీడియోలతో తొందరలోనే ఫాలోవర్లను పెంచుకుంటూ ఫేమస్‌ అయ్యిందీ బ్యూటీ.

‘యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టింది కేవలం నా టైం పాస్‌ కోసమే. నా వీడియోలు పాపులర్‌ అవ్వడం మొదలయ్యాకే నేను ఈ పనిని సీరియస్‌గా తీసుకున్నాను. మధ్యలో చదువుకు ఇబ్బంది అవుతుందని కొన్ని రోజులు యూట్యూబ్‌కి బ్రేక్‌ కూడా ఇచ్చాను’అని చెబుతోంది నిహారిక.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home