‘హీరామండి’తో ఆ కోరిక తీరింది
‘బడే మియాన్ చోటే మియాన్’తో ఇటీవల అలరించిన సోనాక్షి సిన్హా ప్రస్తుతం ‘హీరామండి: ద డైమండ్ బజార్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ‘ఫరీదా’ పాత్రలో కనిపించింది.
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి’లో సోనాక్షితోపాటు మనీషా కొయిరాల, అదితీ రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
‘నాకు నెగెటివ్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. అది ‘హీరామండి’తో తీరింది. ఇందులో విలన్‌గా కనిపించడం నాకు బాగా నచ్చింది’ అంటోంది సోనాక్షి.
‘డబుల్ ఎక్స్‌ఎల్’ సహనటుడుతో సోనాక్షి ప్రేమలో ఉందని పుకార్లు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తనని పెళ్లి గురించి ప్రశ్నించగా నా పార్ట్నర్ గురించి నాకే తెలియదు. నాకు తెలిసిన తర్వాత మీకు చెప్తాను’ అని సమాధానమిచ్చింది.
ఈమెకి మేకప్ ఎక్కువగా వాడటం ఇష్టం ఉండదు. కేవలం సినిమాల కోసమే అది కూడా తేలిగ్గా మాత్రమే వాడతానని చెప్పింది.
‘సాధారణంగా పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చుకోవాలి. కానీ ‘హీరామండి’ సెట్స్‌లో ఉన్నప్పుడు మాత్రం నా శరీరం, మనసు నా అధీనంలో లేవు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాను’ అని ఓ సందర్భంలో తెలిపింది.
ఇటీవల సోనాక్షి ధరించిన ఓ లెహంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘మోడ్రన్ మొఘల్’ కలెక్షన్స్ సంస్థ.. మెరూన్ కలర్ లెహంగాకి గోల్డ్ కలర్ జర్దోసీ వర్క్ చేసింది. దీన్ని డిజైన్ చేసేందకు దాదాపు 1000 గంటల సమయం పట్టింది.
విహార యాత్రల కోసం సోనాక్షి ఎక్కువగా కొండలు, లోయలు ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటుంది. డీటాక్స్ అవ్వాలంటే పచ్చదనమే దానికి సమాధానం అని చెబుతోంది.
బైక్ రైడింగ్ ఇష్టపడే ఈమె రాత్రి వేళల్లో స్నేహితులతో కలిసి రైడింగ్‌కు వెళుతుంది. అది తనకెంతో సంతోషాన్నిస్తుందంటోంది.
This browser does not support the video element.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు పైమాటే..!
ప్రస్తుతం సోనాక్షి తన సోదరుడు ఖుష్ సిన్హా దర్శకత్వంలో ‘నిఖితా రాయ్ అండ్ ద బుక్ ఆఫ్ డార్క్‌నెస్’, ‘కాకుదా’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉంది.