సోనాల్ బర్త్‌డే @ గోవా!
స్టార్ హీరో బాలకృష్ణతో హ్యాట్రిక్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది నటి సోనాల్ చౌహాన్.
Image: Instagram/Sonal Chauhan
తాజాగా సోనాల్.. తన పుట్టిన రోజు(మే16) వేడుకల్ని గోవాలో జరుపుకొంది.
Image: Instagram/Sonal Chauhan
రోజంతా ది వెస్టిన్ రెస్టారెంట్‌లో గడిపింది. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
Image: Instagram/Sonal Chauhan
గతేడాది కూడా ఈ బ్యూటీ.. తన పుట్టిన రోజును గోవాలోనే జరుపుకొంది.
Image: Instagram/Sonal Chauhan
ఉత్తరప్రదేశ్‌లో 1987లో జన్మించిన సోనాల్.. దిల్లీలోని గార్గీ కాలేజ్‌లో ఫిలాసఫీ నుంచి డిగ్రీ పట్టా పొందింది.
Image: Instagram/Sonal Chauhan
మిస్ వర్డల్ టూరిజం 2005 కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళ సోనాల్ చౌహానే.
Image: Instagram/Sonal Chauhan
బాలీవుడ్‌లో ‘జన్నత్(2008)’తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో అదే ఏడాది ‘రెయిన్‌బో’తో అడుగుపెట్టింది. కానీ, గుర్తింపు దక్కలేదు.
Image: Instagram/Sonal Chauhan
బాలయ్య ‘లెజెండ్(2014)’తో మళ్లీ తెలుగుతెరపై కనిపించి ఇండస్ట్రీని ఆకర్షించింది. మరుసటి ఏడాది ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’లో నటించింది.
Image: Instagram/Sonal Chauhan
బాలయ్యతో జోడీ బాగుండటంతో ‘డిక్టేటర్’, ‘రూలర్’లోనూ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టింది. పలు హిందీ, తమిళ చిత్రాల్లోనూ మెరిసింది.
Image: Instagram/Sonal Chauhan
ఇక.. 2022లో ‘ఎఫ్ 3’, ‘ది ఘోస్ట్’ చిత్రాలతో అలరించింది. త్వరలో విడుదలకానున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కీలక పాత్ర పోషించింది.
Image: Instagram/Sonal Chauhan
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సోనాల్.. విహారయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
Image: Instagram/Sonal Chauhan