అందమైన అతిథి

బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ ఓ ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకుంది. అదేనండీ.. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3 పట్టాభిషేకానికి సోనమ్‌ను ఆహ్వానించారు. మే 6న ఈ వేడుక జరగనుంది. 

Image: Instagram/Sonam Kapoor Ahuja

దీంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. భారతీయ సినీపరిశ్రమ తరఫున తనని పిలిచారనుకున్నా... ప్రస్తుతం సోనమ్‌ లైమ్‌లైట్‌లో లేదు.

Image: Instagram/Sonam Kapoor Ahuja

అయినా సోనమ్‌నే ఆహ్వానించడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. తనపై ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి.  

Image: Instagram/Sonam Kapoor Ahuja

ఈ భామ.. బ్రిటన్‌లో నివసిస్తున్న ఆనంద్‌ అహుజాను 2018లో వివాహం చేసుకుంది. 

Image: Instagram/Sonam Kapoor Ahuja

పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం తగ్గించిన సోనమ్‌.. మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. 

Image: Instagram/Sonam Kapoor Ahuja

గతేడాది సోనమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొన్నాళ్లుగా కుమారుడు వయూ సంరక్షణకే పరిమితమైంది.

Image: Instagram/Sonam Kapoor Ahuja

అప్పుడప్పుడు ఫ్యాషన్‌ దుస్తుల్లో తళుక్కుమంటోంది. సోనమ్‌ భర్త అహుజాకు బ్రిటన్‌ కేంద్రంగా ఫ్యాషన్‌ రంగంలో పలు వ్యాపారాలున్నాయి.

Image: Instagram/Sonam Kapoor Ahuja

సోనమ్‌ - అహుజా బ్రిటన్‌లో స్థిరపడటం.. ఇద్దరూ ప్రముఖులే కావడంతో వీరికి ఆహ్వానమంది ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Image: Instagram/Sonam Kapoor Ahuja

ఛార్లెస్‌ 3 పట్టాభిషేకం వేడుకకు సోనమ్‌.. కేవలం అతిథిగా వెళ్లడం కాదు, కామన్‌వెల్త్‌ దేశాల తరఫున ప్రసంగించనుందట.

Image: Instagram/Sonam Kapoor Ahuja

ఇక సోనమ్‌ సినిమాల విషయానికొస్తే.. ‘బ్లైండ్‌’తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image: Instagram/Sonam Kapoor Ahuja

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home