అందాల.. ‘లెహరాయి’

రంజిత్‌ సోమి హీరోగా రామకృష్ణ పరమహంస తెరకెక్కించిన చిత్రం ‘లెహరాయి’. ఎస్‌.ఎల్‌.ఎస్‌.మూవీస్‌ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మించారు.

Image:Instagram

సౌమ్య మేనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 

టీజర్‌ని ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ‘లెహరాయి’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సౌమ్య మేనన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Image:Instagram

కేరళలోని త్రిస్సూర్‌లో 1990 ఆగస్టు 6న జన్మించిన సౌమ్య మేనన్.. అదే నగరంలో ఎం.కామ్‌ వరకు చదివింది.

Image:Instagram

అనంతరం మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 2018లో ‘కినావల్లి’ అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది.

Image:Instagram 

ఇప్పటివరకు మాలీవుడ్‌లో అర డజనుకుపైగా సినిమాలు చేసిన ఈ భామ.. ‘హంటర్‌ ఆన్‌ డ్యూటీ’తో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

Image:Instagram 

సౌమ్య మేనన్‌కి టాలీవుడ్‌ కొత్తేమీ కాదు. ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ కీర్తి సురేశ్ స్నేహితురాలిగా నటించింది.

Image:Instagram 

హరీష్‌ సజ్జా తెరకెక్కించిన ‘ట్యాక్సీ’లోనూ నటించింది. 

వసంత్ సమీర్‌ పిన్నమరాజు, అల్మాస్‌ మోటివాలా, సూర్య శ్రీనివాస్‌, సౌమ్య మేనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image:Instagram 

ఈ బ్యూటీ మంచి డ్యాన్సర్‌ కూడా. ట్రావెలింగ్‌, షాపింగ్‌ హాబీస్‌.

Image:Instagram

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home