కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలివీ...!

కొత్త పార్లమెంటు భవనాన్ని మే 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పార్లమెంట్‌కు సంబంధించి.. కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందామా..

Image: Twitter

డిసెంబరు 10, 2020న ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. త్రిభుజాకారంలో పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టారు. 150 ఏళ్ల పాటు మన్నికగా ఉండేలా తీర్చిదిద్దారు. పాత పార్లమెంటు భవనం అలాగే ఉంటుంది.

Image: Twitter

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రూ.970 కోట్లతో 64,500 చదరపు మీటర్లలో నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 60వేల మంది కార్మికులు శ్రమించారు.

Image: Twitter

అత్యంత భద్రత, ఆధునిక సాంకేతిక హంగులు, పర్యావరణహితంగా నిర్మించిన ఈ కొత్త పార్లమెంట్‌ భవనానికి ‘ది పార్లమెంటు భవన్‌(సంసద్‌ భవన్‌)’గా నామకరణం చేశారు. 

Image: Twitter

మొత్తం.. 1,272 మంది ఎంపీలు ఒకేసారి కూర్చునేలా సమావేశ మందిరం ఉంటుంది. ఇతర సమావేశం మందిరాలు, కమిటీ హాళ్లు కూడా నిర్మించారు. 

Image: Twitter

ఈ పార్లమెంట్‌లో రాజదండం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీన్ని స్పీకర్‌ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది చోళుల నాటిది. దీన్ని సెంగోల్‌గా పిలుస్తారు. 

Image: Twitter

ఈ రాజదండం ఏర్పాటు ప్రక్రియ ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. ప్రధానే స్వయంగా రాజదండాన్ని పార్లమెంట్‌లోకి తీసుకొచ్చారు.

Image: Twitter

సెంట్రల్‌ విస్టాలో పార్లమెంట్‌ ఉభయసభలతోపాటు ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం, కేంద్ర సచివాలయం కూడా ఇందులో ఉంటాయి.

Image: Twitter

ఇందులో మూడు ప్రధాన ద్వారాలుంటాయి. జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు. ఎంపీలు, వీఐపీలు, సందర్శకులకు వేర్వేరు మార్గాలుంటాయి.

Image: Twitter

భారతదేశ వారసత్వానికి ప్రతీకగా భారీ రాజ్యాంగ మందిరం నిర్మించారు. రాజ్యాంగం అసలు ప్రతిని ఇందులో భద్రపరుస్తారు.

Image: Twitter

ఇక్కడి సిబ్బంది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ రూపొందించిన యూనిఫార్మ్‌తో కనిపించనున్నారు. 

Image: Twitter

చిత్రం చెప్పేవిశేషాలు (22-04-2024)

అశ్వత్థామ.. అమితాబ్‌.. వైరల్

మట్టిపాత్రలు చేసిన సార్‌ బ్యూటీ

Eenadu.net Home