తరగని అందం ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ సొంతం!

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌.. చాలా కాలం తర్వాత మరోసారి కోలీవుడ్‌లో సందడి చేసింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నందినిగా నటించింది.

Image:Instagram/AishwaryaRaiBachchan

నేడు ఐశ్వర్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Image:Instagram/AishwaryaRaiBachchan

ఐశ్వర్య 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత ‘ఇద్దరు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. 

Image: Instagram/AishwaryaRaiBachchan

చిన్నతనంలోనే కామెలిన్‌ పెన్సిల్‌ ప్రచార చిత్రంలో మెరిసింది. ప్రపంచ సుందరి కాకముందు పెప్సీ యాడ్‌లో ఆమిర్‌ ఖాన్‌తో కలిసి నటించింది.

Image: Instagram/AishwaryaRaiBachchan

నటి అవ్వాలని ఐశ్వర్య అస్సలు అనుకోలేదట. మెడిసిన్‌ చదవాలనుకుంది. అది కుదరక ఆర్కిటెక్ట్‌ కోర్సులో చేరింది. చివరకు మోడలింగ్‌.. సినిమాల వైపు వచ్చేసింది.

Image: Instagram/AishwaryaRaiBachchan

రెండున్నర దశాబ్దాల తన సినీ కెరీర్‌లో 45కు పైగా సినిమాల్లో నటించింది. అందులో ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలే కాగా.. ఆరు మాత్రమే కోలీవుడ్‌ చిత్రాలు. హాలీవుడ్‌లో 5, బెంగాలీలో ఒక చిత్రంలో నటించింది. Image:Instagram/AishwaryaRaiBachchan

ఈ ప్రపంచ సుందరి.. తెలుగు తెరపై కనిపించింది ఒకే ఒక్కసారి. 1999లో వచ్చిన ‘రావోయి చందమామ’లోని ప్రత్యేక గీతంలో నాగార్జునతో కలిసి ఆడిపాడింది.

Image: Instagram/AishwaryaRaiBachchan

‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’, ‘దేవదాస్‌’ చిత్రాలకుగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకుంది.

Image: Instagram/AishwaryaRaiBachchan

నెదర్లాండ్స్‌లోని కొకెనాఫ్‌ గార్డెన్‌లోని తులిప్‌ పువ్వుకు ఐశ్వర్యరాయ్‌ పేరు పెట్టారు.

Image:Instagram/AishwaryaRaiBachchan

పాపులర్‌ టాక్‌ షో.. ఓప్రా విన్‌ఫ్రే షో నుంచి ఆహ్వానం అందుకున్న తొలి భారతీయురాలు కూడా తనే. మేడమ్‌ టుస్సాడ్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ కూడా ఐశ్వర్యనే.

Image: Instagram/AishwaryaRaiBachchan

ఈ అందాల తారను అనేక అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం 2009లో ‘పద్మ శ్రీ’తో సత్కరించింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఉన్నత పురస్కారాన్ని కూడా అందుకుంది.

Image: Instagram/AishwaryaRaiBachchan

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీలో సభ్యురాలిగా చేరిన తొలి భారతీయ నటి ఐశ్వర్యనే.

Image: Instagram/AishwaryaRaiBachchan

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

రవీనా టాండన్‌ వారసురాలు.. భలే చలాకీ!

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

Eenadu.net Home