గూగుల్‌ పిక్సెల్ 7, పిక్సెల్‌ 7 ప్రో వచ్చేశాయి!

గూగుల్‌ పిక్సెల్‌ సిరీస్‌లో తాజాగా 7, 7 ప్రో మోడల్స్‌ విడుదలయ్యాయి. మరి వాటి ఫీచర్లేంటో తెలుసుకుందాం..

Image: Google

గూగుల్‌ పిక్సెల్‌ 7 ప్రో

ఈ మొబైల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఇచ్చారు. కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది.

Image: Google

దీంట్లో సరికొత్త టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను వాడారు. 12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లున్నాయి.

Image: Google

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్‌, 48 ఎంపీ టెలీఫొటో కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 10.8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Google

ఇందులో 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ధర రూ. 85వేల నుంచి ప్రారంభమవుతుంది.

Image: Google

గూగుల్‌ పిక్సెల్‌ 7

ఈ మొబైల్‌ 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.3 అంగుళాల అమోలెడ్‌ ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తోంది. గోరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది.

Image: Google

దీంట్లోనూ గూగుల్‌ టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్‌, 128 / 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లో మొబైల్‌ లభిస్తుంది.

Image: Google

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ముందువైపు 10.8ఎంపీ కెమెరా అమర్చారు.

Image: Google

ఇందులో 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,335ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 60వేలు.

Image: Google

ప్రస్తుతం ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. బ్యాంక్‌ ఆఫర్ల కింద దాదాపు రూ. 5 వేల నుంచి రూ. 10వేల వరకు రాయితీ లభిస్తోంది.

Image: Google

సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయితే?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

Eenadu.net Home