లావా బ్లేజ్‌ ప్రో.. ఫీచర్లివే!

లావా సంస్థ నుంచి కొత్తగా ‘బ్లేజ్‌ ప్రో’ మోడల్‌ మార్కెట్లోకి విడుదలైంది. ఫీచర్లేమున్నాయంటే..

Image: Lava

లావా బ్లేజ్‌ ప్రోలో 6.5 అంగుళాల ఐపీఎస్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్‌ రేట్‌ 90 హెర్జ్‌.

Image: Lava

ఆండ్రాయిడ్‌ 12తో నడిచే ఈ మొబైల్‌లో మీడియాటెక్‌ జీ37 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అమర్చారు.

Image: Lava

వెనుకవైపు 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా ఉంది. 6 రెట్లు జూమ్‌ చేసే సామర్థ్యముంది. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Lava

ఇందులో 10 వాట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Lava

మొబైల్‌లో 4 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. వర్చువల్‌గా మరో 3 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంది.

Image: Lava

గ్లాస్‌ గ్రీన్‌, గ్లాస్‌ ఆరెంజ్‌, గ్లాస్‌ బ్లూ, గ్లాస్‌ గోల్డ్‌ రంగుల్లో ఈ మొబైల్‌ లభించనుంది.

Image: Lava

మొబైల్‌ పాడైతే.. ఇంటి వద్దే ఉచితంగా మరమ్మతు చేస్తామని, వంద రోజుల్లో ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌ చేస్తామని సంస్థ చెబుతోంది.

Image: Lava

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 9,999గా ఉంది.

Image: Lava

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home