లావా ఎక్స్‌ 3.. ఫీచర్లివే!

స్మార్ట్‌ఫోన్లలో ఎంట్రీ లెవల్‌ మోడల్‌ను విడుదల చేసింది ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా.

Image: Lava

‘లావా ఎక్స్‌3’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 

Image: Lava

మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను వాడారు. ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లున్నాయి.

Image: Lava

ఈ మొబైల్‌లో 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Lava

వెనుకవైపు 8 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు వీజీఏ కెమెరా ఉంది. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Lava

ఇందులో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 10 వాట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Lava

ఆండ్రాయిడ్‌ 12గో ఎడిషన్‌తో పనిచేసే ఈ మొబైల్‌ ఆర్టిక్‌ బ్లూ, చార్‌కోల్‌ బ్లాక్‌, లస్టర్‌ బ్లూ రంగుల్లో లభించనుంది.

Image: Lava

దీని ధర రూ. 6,999. డిసెంబర్‌ 20 నుంచి అమెజాన్‌లో విక్రయాలు మొదలవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.

Image: Lava

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home