లెనోవా నుంచి ప్రీమియం ట్యాబ్‌.. ఫీచర్లేమున్నాయంటే..?

తాజాగా భారత మార్కెట్లో లెనోవా నుంచి ప్రీమియం రేంజ్ ‘ట్యాబ్‌ పీ11 ప్రో (జెన్‌ 2)’ విడుదలైంది.

Image: Lenovo

ఈ ట్యాబ్‌లో 11.2 అంగుళాల 2.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Lenovo

మీడియాటెక్‌ కాంపానియో 1300టీ ప్రాసెసర్‌ను వాడారు. దీంట్లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Lenovo

ట్యాబ్ వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు.

Image: Lenovo

దీంట్లో డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్‌ చేసే జేబీఎల్‌ క్వాడ్‌-స్పీకర్స్‌ ఉన్నాయి.

Image: Lenovo

ఆండ్రాయిడ్‌ 12తో పనిచేసే ఈ ట్యాబ్‌ను.. ఆండ్రాయిడ్‌ 14 వెర్షన్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

Image: Lenovo

ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 14 గంటల వీడియో ప్లేబ్యాక్‌ ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Image: Lenovo

ఈ ట్యాబ్‌ ధర రూ.39,999. లెనోవా, అమెజాన్ పోర్టల్స్‌లో విక్రయాలు మొదలయ్యాయి.

Image: Lenovo

ఈ ట్యాబ్ ప్రెసిషన్ పెన్ 3, డిటాచబుల్‌ కీబోర్డును సపోర్ట్‌ చేస్తుంది. కావాలనుకుంటే వాటిని విడిగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Image: Lenovo

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home