మార్కెట్లో విడుదలైన మోటో ఈ32.. ఫీచర్లివే!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా తాజాగా మోటో ఈ32 మోడల్‌ను విడుదల చేసింది.

Image: Motorola/Flipkart

దీంట్లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. రిఫ్రెష్‌రేట్‌ 90 హెర్జ్‌.

Image: Motorola/Flipkart

ఆక్టా-కోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ37 ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు పవర్‌ వీఆర్‌ జీఈ8320 జీపీయూ ఉంది.

Image: Motorola/Flipkart

ఇందులో 4 జీబీ ర్యామ్‌.. 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. ఎస్డీకార్డ్‌తో 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

Image: Motorola/Flipkart

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ 4జీ మొబైల్‌.. రెండేళ్లలో వచ్చే కొత్త ఓఎస్‌, సెక్యూరిటీ ప్యాచెస్‌ అప్‌గ్రేడ్స్‌ను సపోర్ట్‌ చేస్తుందని సంస్థ హామీ ఇస్తోంది.

Image: Motorola/Flipkart

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Motorola/Flipkart

దీంట్లో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లున్నాయి.

Image: Motorola/Flipkart

ఆర్కిటిక్‌ బ్లూ, ఎకో బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 10,499. మోటోరోలా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలయ్యాయి.

Image: Motorola/Flipkart

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home