నోకియా జీ60.. ఇయర్‌ బడ్స్‌ ఫ్రీ!

మొబైల్‌ రంగంలో మరోసారి నోకియా దూసుకెళ్తోంది. తాజాగా ‘నోకియా జీ60’ పేరుతో 5జీ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 

Image: Nokia

దీంట్లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

Image: Nokia

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను వాడారు. 

Image: Nokia

ఇందులో 6 జీబీ ర్యామ్‌, 128 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. 

Image: Nokia

వెనుకవైపు 50+5+2 ఎంపీ కెమెరాలు.. ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా అమర్చారు. 

Image: Nokia

ఈ 5జీ మొబైల్‌లో 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 

Image: Nokia

ఆండ్రాయిడ్‌ 12తో పనిచేసే ఈ మొబైల్‌ మూడేళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను సపోర్ట్‌ చేస్తుందని సంస్థ చెబుతోంది. 

Image: Nokia 

ఐస్‌, బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 32,999. కాగా.. పరిచయ ఆఫర్‌ కింద ప్రీ బుకింగ్‌ చేసుకున్న వారికి రూ. 29,999కే లభించనుంది.

Image: Nokia

ప్రీ బుకింగ్‌ చేసుకునే వారికి రూ. 3,500 విలువ చేసే నోకియా పవర్‌ ఇయర్‌బడ్స్‌ లైట్‌ ఉచితంగా ఇవ్వనున్నారు. నవంబర్‌ 8 నుంచి మొబైల్‌ అందుబాటులోకి రానుంది. 

Image: Nokia

సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయితే?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

Eenadu.net Home