బడ్జెట్‌ ధరలో నోకియా ట్యాబ్‌.. వివరాలివిగో!

నోకియా తాజాగా ‘టీ10’ మోడల్‌ ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది.

Image: Nokia

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

Image: Nokia

యూనిసాక్‌ టీ606 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఈ ట్యాబ్‌ 3 జీబీ.. 4 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. 

Image: Nokia

ముందు, వెనుక 8 ఎంపీ కెమెరా ఉంది. 2 ఎంపీ సెన్సర్‌ కెమెరా కూడా అమర్చారు.

Image: Nokia

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,250 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Nokia

స్టీరియో స్పీకర్స్‌, బయోమెట్రిక్‌ ఫేస్‌ అన్‌లాక్‌, గూగుల్‌ కిడ్స్‌ స్పేస్‌ ఫీచర్లూ ఉన్నాయి.

Image: Nokia

3 జీబీ / 32 జీబీ వేరియంట్‌ ధర రూ. 11,799 కాగా.. 4 జీబీ / 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 12,799.

Image: Nokia

ప్రస్తుతం వైఫై ఎనబుల్డ్‌ మోడల్‌లోనే ఈ ట్యాబ్‌ లభిస్తోంది. అమెజాన్‌, నోకియా వెబ్‌సైట్స్‌ విక్రయాలు మొదలయ్యాయి. ఎల్‌టీఈ మోడల్‌ను కూడా త్వరలో విడుదల చేస్తారట.

Image: Nokia

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home