పోకో నుంచి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌

మొబైల్‌ మార్కెట్లో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ పోకో.

Image: Flipkart

పోకో సీ50 పేరుతో విడుదల చేసిన ఈ మొబైల్‌లో 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

Image: Flipkart

దీంట్లో మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌ వాడారు. 

Image: MediaTek

వెనకవైపు 8 ఎంపీ కెమెరాతోపాటు ఆక్సిలరీ లెన్స్‌ ఉన్నాయి. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Flipkart

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Flipkart

ఆండ్రాయిడ్‌ 12 గో ఎడిషన్‌తో పనిచేసే ఈ మొబైల్‌ కంట్రీ గ్రీన్‌, రాయల్‌ బ్లూ రంగుల్లో లభించనుంది. 

Image: Flipkart

ఈ మోడల్‌లో 2జీబీ/32 జీబీ వేరియంట్‌ ధర రూ. 6,499 కాగా.. 3జీబీ/32 జీబీ వేరియంట్‌ ధర రూ. 7,299గా ఉంది.

Image: Flipkart

జనవరి 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. పోకో సంస్థ.. మొబైల్‌కు ఏడాది, బాక్స్‌లో వచ్చే ఇతర యాక్సెసెరీస్‌లకు 6 నెలల వారెంటీ ఇస్తోంది.

Image: Flipkart

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home