రియల్‌మీ కొత్త మొబైల్స్‌ చూశారా!

భారత మొబైల్‌ మార్కెట్లో తాజాగా రియల్‌మీ 10 ప్రో ప్లస్‌, రియల్‌మీ ప్రో పేర్లతో 5జీ మొబైల్స్‌ విడుదల అయ్యాయి. వాటి వివరాలు ఇవిగో...

Image: Realme

రియల్‌మీ 10 ప్రో ప్లస్‌

ఈ మొబైల్‌ 6.7 అంగుళాల 120 హెర్జ్‌ కర్వ్‌డ్‌ విజన్‌ డిస్‌ప్లేతో వస్తోంది. డైమెన్సిటీ 1080 5జీ ప్రాసెసర్‌ను వాడారు. ఈ ప్రాసెసర్‌ను వినియోగించడం భారత్‌లో ఇదే తొలిసారి. 

Image: Realme

6జీబీ /128 జీబీ, 8 జీబీ / 256 జీబీ వేరియంట్లలో లభించనుంది. మరో 8 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఇందులో 67 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Realme

వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 

Image: Realme

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. హైపర్‌ స్పేస్‌ గోల్డ్‌, డార్క్‌ మ్యాటర్‌, నెబ్యూలా బ్లూ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 25 వేలు ఉంటుందని అంచనా. 

Image: Realme

రియల్‌మీ 10 ప్రో

ఇందులో 6.7 అంగుళాల 120 హెర్జ్‌ బౌండ్‌లెస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను వాడారు.

Image: Realme

ఈ మొబైల్‌ 6 జీబీ, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్లో 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభించనుంది. వర్చువల్‌గా 8 జీబీ ర్యామ్‌ను పెంచుకోవచ్చు. 

Image: Realme

ఇందులో 33 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Realme

వెనుకభాగంలో 108 + 2 ఎంపీ కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

Image: Realme

హైపర్‌స్పేస్‌ గోల్డ్‌, డార్క్‌ మ్యాటర్‌, నెబ్యూలా బ్లూ రంగులో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 20వేలు ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్‌ 16 నుంచి విక్రయాలు మొదలవుతాయి. 

Image: Realme

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home