₹9వేలలోపే రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్‌!

రియల్‌మీ సంస్థ తాజాగా రూ.9వేలలోపు ధరతో ‘సీ30ఎస్‌’ మోడల్‌ మొబైల్‌ను విడుదల చేసింది. వాటి ఫీచర్లివీ..!

Image: Realme

ఈ మొబైల్‌లో 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు.

Image: Realme

యూనిసాక్‌ SC9863A1 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ను వాడారు.

Image: Realme

వెనుకవైపు 8 ఎంపీ ఏఐ కెమెరా.. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Image: Realme

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Realme

ఫోన్‌ అన్‌లాక్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఇచ్చారు.

Image: Realme

ఆండ్రాయిడ్‌ 12ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభించనుంది.

Image: Realme

2 జీబీ / 32 జీబీ వేరియంట్‌ ధర రూ. 7,499 కాగా.. 4 జీబీ / 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 8,999.

Image: Realme

సెప్టెంబర్‌ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లోనూ విక్రయాలు మొదలవుతాయి. 

Image: Realme 

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home