బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ గెలాక్సీ A04s!

శాంసంగ్‌ గెలాక్సీ A04sలో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫీనిటీ వీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Samsung

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ 4జీ మొబైల్‌లో ఆక్టా-కోర్‌ ఎక్జీనోస్‌ 850 ప్రాసెసర్‌ను వాడారు.

Image: Samsung

ఇందులో 4 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. దీన్ని శాంసంగ్‌ ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌తో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంది.

Image: Samsung

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2+2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 5 ఎంపీ కెమెరా అమర్చారు.

Image: Samsung

ఇందులోని ఆడియో సిస్టమ్‌ డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్‌ చేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు.

Image: Samsung

బ్యాటరీ విషయానికొస్తే.. 15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Samsung

బ్లాక్‌, గ్రీన్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 13,499.

Image: Samsung

ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ పోర్టల్స్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ మొబైల్ లభించనుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద వివిధ క్రెడిట్‌కార్డులపై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నారు.

Image: Samsung

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home