13జీబీ ర్యామ్‌తో టెక్నోపోవా 4 మొబైల్‌!

చైనా మొబైల్‌ తయారీ సంస్థ టెక్నో.. తాజాగా పోవా 4 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 

Image: Pova

ఈ మొబైల్‌ 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 

Image: Pova

మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ను దీంట్లో అమర్చారు. 

Image: Pova

ఇందులో 8 జీబీ ర్యామ్‌ ఉంది. దీన్ని 13 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. 

Image: Pova

వెనుకభాగంలో 50 ఎంపీ డ్యుయెల్‌ కెమెరా, ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Image: Pova

ఈ మొబైల్‌లో 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. బ్యాటరీ దెబ్బతినకుండా.. ఎస్‌టీఎస్‌ బ్యాటరీ సేఫ్టీ టెక్నాలజీని వాడారు.

Image: Pova

ఏఐ నాయిస్‌ రిడక్షన్‌తో కూడిన డ్యూయల్‌ స్పీకర్స్‌, గ్రాఫైట్‌ కూలింగ్‌ సిస్టమ్‌, బ్యాటరీ తక్కువ ఖర్చయ్యేలా పాంథర్‌ ఇంజిన్‌ 2.0 ఉన్నాయి.

Image: Pova

బ్లూ, గ్రే రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 11,999గా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్నో ఆన్‌లైన్‌స్టోర్‌తోపాటు అమెజాన్‌లో డిసెంబర్‌ 13 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

Image: Pova

అంతరిక్ష కేంద్రం.. ఆసక్తికర విషయాలు

గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ.. ధర, ఫీచర్లివే..

Eenadu.net Home