టెక్నో పోవా నియో 5జీ.. బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్స్‌!

పోవా సిరీస్‌లో తాజాగా మరో 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది టెక్నో సంస్థ. వివరాలివీ..

Image: Tecno

‘టెక్నో పోవా నియో 5జీ’లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Tecno

మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు మాలీ-జీ57 జీపీయూ ఉంది.

Image: Tecno

మొబైల్‌లో 4 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. మరో 3 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ఉంది.

Image: Tecno

వెనుకవైపు 50 ఎంపీ ఏఐ డ్యుయల్‌ కెమెరా అమర్చారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Tecno

ఇందులో 18 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Tecno

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత హాయ్‌ ఓఎస్‌ 8.6తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది.

Image: Tecno

స్ప్రింట్‌ బ్లూ, సఫ్పైర్‌ బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 15,499.

Image: Tecno

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home