టాలీవుడ్ గూఢచారులు
నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించే గూఢచారి కథ ఇది. ప్రస్తుతం పలువురు టాలీవుడ్ హీరోలు కూడా ఇలాంటి స్పై చిత్రాల్లో నటిస్తున్నారు. వాళ్లెవరో ఓ లుక్కేద్దామా..
Image:Twitter
రవితేజ - ఈగల్
Image:twitter
రవితేజ 73వ చిత్రం ‘ఈగల్’. అనుపమ, మధుబాల, నవదీప్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కూడా రా ఏజెన్సీ, యాక్షన్ జానర్‌లోనే తెరకెక్కుతోంది.
Image:twitter
విజయ్ దేవరకొండ @ VD 12
Image:Twitter
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది స్పై జానర్ అని తెలుస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Image:Twitter
కల్యాణ్ రామ్ @ డెవిల్
Image:Twitter
చారిత్రక నేపథ్యంలో సాగే స్పై కథే ‘డెవిల్’. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కల్యాణ్‌రామ్ కనిపించనున్నాడు. దీన్ని కొత్త దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు.
Image:Twitter
అడివి శేష్ @ జీ2
Image:Twitter
అడివి శేష్ ‘గూఢచారి’ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘జీ2’ తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకుడు.
Image:Twitter
వరుణ్ తేజ్ @ గాండీవధారి అర్జున
Image:Twitter
‘PSVగరుడవేగ’, ‘ది ఘోస్ట్’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ‘గాండీవధారి అర్జున’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ స్పైగానే నటిస్తున్నాడు.
Image:Twitter
సమంత @ సిటడెల్
Image:Twitter
‘ఫ్యామిలీమ్యాన్ 2’లో తీవ్రవాదిలా కనిపించిన సమంత.. ఇప్పుడు స్పై అవతారమెత్తింది. ప్రస్తుతం ఈమె ‘సిటడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇది ప్రియాంక ‘సిటాడెల్’కి రీమేక్ కాదని ఇటీవల సమంత స్పష్టం చేసింది.
Image:Twitter
మహేశ్‌బాబు @ రాజమౌళి చిత్రం
Image:Twitter
ఎస్.ఎస్. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇది ఆఫ్రికన్ అడవుల్లో సాగే స్పై థ్రిల్లర్ అని సినీవర్గాలు చెబుతున్నాయి.
Image:Twitter
ఈ మధ్యే విడుదలైన ‘ఏజెంట్’లో అఖిల్ గూఢచారిగా నటించాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.
Image:Twitter