అది నా ఇష్టం.. మీరెవ్వరు అడగడానికి?

తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న స్రవంతి చొక్కారపు ఇటీవల ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ధరించిన చీరతో వార్తల్లో నిలిచింది.

 చమ్కీలు, గవ్వలు, కాసులు, పూసలు ఇలా అనేక రకాల వస్తువులతో తయారు చేశారు. లేత గులాబీ రంగు, తెలుపు కలయికలో క్లాసిక్‌ లుక్‌లో ఉన్న చీరను ధరించి హైలైట్‌గా నిలిచింది.

స్రవంతి 2009లో డిగ్రీ పూర్తయ్యాక మోడలింగ్‌ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత యాంకరింగ్‌ అవకాశమొచ్చింది.

యూట్యూబ్ ఛానల్‌లో సినిమాలపై రివ్యూలు ఇస్తూ.. ఫ్యాషన్‌, ట్రావెలింగ్‌ బ్లాగ్‌లు చేస్తుంటుంది. పలు గేమ్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది.

This browser does not support the video element.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కామెడీ పంచ్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ షోతో ఈమెకు క్రేజ్‌ వచ్చింది.

‘బిగ్ బాస్‌ నాన్‌ స్టాప్‌ 2022’ పాల్గొన్న తర్వాత నుంచీ స్రవంతికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది.

‘నాకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. ఒకవేళ యాంకర్‌ని కాకపోయి ఉంటే.. ఫ్యాషన్‌ డిజైనర్‌ని అయ్యి ఉండేదాన్ని’’ అని ఓ సందర్భంలో చెప్పింది. 

ఈమె డ్రెస్సింగ్‌పై వచ్చే నెగెటివ్‌ కామెంట్లకు ‘అది నా పర్సనల్‌. నా డ్రెస్సింగ్‌ సెన్స్‌ గురించి మాట్లాడేందుకు మీకెవరిచ్చారు హక్కు’ అంటూ స్రవంతి గట్టిగా సమాధానమిచ్చింది.

‘ఎంతో కష్టపడితే గానీ మనకంటూ గుర్తింపు రాదు. చిన్న చిన్న విషయాలకే డీలా పడిపోతే ఇంక ముందుకెళ్లలేం. అనుకున్నది సాధించే వరకూ పట్టు వదలకూడదు’ అని సలహా ఇస్తోంది. 

పండుగలు, ఫంక్షన్లలో చీరకట్టుతో సందడి చేస్తుంటుంది. సెలబ్రిటీలతో చేసిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది.

This browser does not support the video element.

ఈమెకి ఫొటోషూట్లంటే మహా ఇష్టం. గ్లామరస్‌ పోజులతో సోషల్‌ మీడియాని హీటెక్కిస్తుంటోంది. విభిన్నమైన దుస్తులు ధరించి తరచూ వార్తల్లో నిలుస్తోంది.    

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home