చేతినిండా సినిమాలే.. శ్రీలీల యమా.. బిజీ!
టాలీవుడ్‌లో ఇప్పుడు బిజీగా ఉన్న కథానాయిక ఎవరు అంటే... ఠక్కున వచ్చే పేరు శ్రీలీల. ఎందుకంటే అన్ని సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలే ఎక్కువ. అవేంటో ఓ లుక్కేయండి!
This browser does not support the video element.
స్కంద
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. బోయపాటి శ్రీను దర్శకుడు. సెప్టెంబరు 28న సినిమా విడుదల. తొలుత 15న ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు.
భగవంత్ కేసరి
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ కథానాయిక. శ్రీలీలది ముఖ్య పాత్ర. అక్టోబరు 19న సినిమా వస్తోంది.
ఆదికేశవ
వైష్ణవ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా నవంబరు 10న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.
ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్
నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో నితిన్, శ్రీలీల జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్నారని టాక్.
గుంటూరు కారం
మహేష్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలుండగా... శ్రీలీల ఒకరు. మరో నాయిక మీనాక్షి చౌదరి.
#VD12
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న పిక్చర్ ఇది. ఈ సినిమాలో విజయ్ పోలీసుగా కనిపించబోతున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉండగా... ఒక పాత్ర శ్రీలీల చేస్తోంది. మరో హీరోయిన్ సాక్షి వైద్య.
అనగనగా ఒక రోజు
నవీన్ పొలిశెట్టి హీరోగా కొన్ని నెలల క్రితం ప్రారంభమైన చిత్రమిది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని సమాచారం.
జూనియర్
రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఇది. చాలా నెలల క్రితమే ఈ సినిమా మొదలైనా.. విడుదల విషయంలో స్పష్టత లేదు.
This browser does not support the video element.
ఇవి ప్రస్తుతానికి ఓకే అయిన, సెట్స్ మీద ఉన్న సినిమాలు మాత్రమే. ఇవి కాకుండా చిరంజీవి 156వ సినిమా, రామ్‌చరణ్ కొత్త సినిమా, నితిన్ - వెంకీ కుడుముల ప్రాజెక్ట్... ఇలా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.