బాలీవుడ్‌ ఎంట్రీకి శ్రీలీల రెడీ!

‘ధమాకా’ హిట్‌ కొట్టి.. వరుస అవకాశాలు పట్టి.. టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

సిద్ధార్థ్‌ మల్హోత్ర సరసన ‘మిట్టి’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌లో తాను నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిందీ బ్యూటీ. దర్శకుడు బల్వీందర్‌ సింగ్‌.

ఈ ఏడాది ఆరంభంలో ‘గుంటూరు కారం’తో అలరించిన ఈమె ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

‘రాబిన్‌ హుడ్‌’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, రవితేజ ‘#rt75’లోనూ నటిస్తోంది. రాబిన్‌ హుడ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది.

స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం నా కలే.. కానీ నేనింకా ఆ స్థాయికి ఎదగలేదు. అప్పుడే నన్ను స్టార్‌ హీరోయిన్‌ అని పిలవడం ఏం బాగోలేదు’ అని ఓ ఇంటర్వూలో అంది.

డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్‌ అయ్యాను అని ఎన్నో సందర్భాల్లో చెప్పింది శ్రీలీల. అంతే కాదు ప్రస్తుతం నటిస్తూనే ఎంబీబీఎస్‌ చదువుతోంది కూడా.

ఓ సినిమాకి డేట్స్‌ ఇచ్చే సమయంలోనే రాత్రిళ్లు లేచి చదవాలని ఫిక్స్‌ అయిపోతుందట. ‘నటన కాకుండా మరోటి చేయాలంటే పుస్తకం పట్టుకుంటాను’ అంటోందీమె. 

‘ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఎవరో ఒకరి సపోర్ట్‌ కావాలి. మా ఇంట్లో అందరూ వైద్య వృత్తిలోనే ఉన్నారు. నేను నటిస్తాను అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఆ సమయంలో తాతయ్యే నాకు అండగా నిలిచి ఇంట్లో వాళ్లని ఒప్పించారు’ అని ఓ సందర్భంలో చెప్పింది.

డ్యాన్స్‌ చేయడం అంటే శ్రీలీలకి ఇష్టం. చిన్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. స్ప్రింగ్‌లా మెలికలు తిరుగుతూ ఈ బ్యూటీ వేసే స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోతుంటారు.

పలు మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలకు పోజులివ్వడమే కాకుండా, ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ఇన్‌స్టాలో ఈమెను 58లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home