శ్రీలీల.. ఒకేసారి ఎనిమిది సినిమాలా....

‘పెళ్లి సందD’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. రవితేజ ‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. 

Image: Instagram/Sreeleela

అదే జోరుతో ఈ భామ ప్రస్తుతం.. ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. అందులో అరడజను సినిమాలు స్టార్‌ హీరోలవే.

Image: Instagram/Sreeleela

మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు పూజా హెగ్డే కాగా.. రెండో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైంది.

Image: Instagram/Sreeleela

హాస్య చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రధాన కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలో శ్రీలీల నటిస్తోంది. 

Image: Instagram/Sreeleela

‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత హరీశ్‌ శంకర్‌ - పవన్‌ కల్యాణ్‌ కాంబోలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రాబోతోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈమెకి స్వాగతం పలికింది. 

Image: Instagram/Sreeleela

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్‌కి జోడీగా శ్రీలీల కనిపించనుంది.

Image: Instagram/Sreeleela

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ 32వ సినిమా రాబోతోంది. నితిన్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇటీవల చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం కూడా జరిగింది. 

Image: Instagram/Sreeleela

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో ‘అనగనగా ఓ రాజు’ తెరకెక్కుతోంది. ఇందులో నవీన్‌ పొలిశెట్టి హీరో కాగా.. హీరోయిన్‌ శ్రీలీలనే. 

Image: Instagram/Sreeleela

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నాలుగో చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

Image: Instagram/Sreeleela

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ‘వారాహి చలన చిత్రం’ నిర్మాణ సంస్థ ‘జూనియర్‌’ అనే సినిమా తీస్తోంది. ఇందులో కిరీటికి జోడీగా శ్రీలీల నటిస్తోంది. 

Image: Instagram/Sreeleela

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home