SRH క్వీన్‌.. కావ్య

కావ్య మారన్‌.. క్రికెట్ ప్రేమికులకు, ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 

This browser does not support the video element.

ఐపీఎల్‌లో హైదరాబాద్‌ మ్యాచ్‌లకు హాజరై ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఇంతకీ ఈమె ఎవరు? ఇష్టాయిష్టాలేంటో తెలుసా?

ఆగస్టు 6, 1992న చెన్నైలో కావ్య జన్మించారు. బిజినెస్‌పై ఆసక్తితో ఎంబీఏ చేశారు. ఏవియేషన్‌, మీడియా అంటే ఇష్టం. 

ఎస్‌ఆర్‌హెచ్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య.. తండ్రి కళానిధి మారన్‌తో కలసి సహ యాజమాని.

ఆమెకు రూ.4 వేల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. భారత్‌లో అత్యంత సంపద కలిగిన యువ పారిశ్రామికవేత్తల్లో ఆమె ఒకరు. 

చలాకీగా ఉండే కావ్య.. సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి ఆటగాళ్లలో హుషారు నింపే ప్రయత్నం చేస్తుంటారు.

క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకర్షించే కావ్య వైపే కెమెరాల ఫోకస్ కూడా ఉంటుంది. ఆమె కోసమే హైదరాబాద్‌ మ్యాచ్‌లు చూసే వారున్నారు. 

కావ్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పెయింటింగ్, స్విమ్మింగ్ హాబీస్‌. గోవా, ముంబయి, దుబాయ్, స్విట్జర్లాండ్ నచ్చిన ప్రదేశాలు. ఎక్కువగా భారతీయ వంటకాలనే తినడానికి ఇష్టపడతారు.

నచ్చిన ఆట క్రికెట్. విరాట్ కోహ్లీ ఫేవరెట్ క్రికెటర్. షారుఖ్‌ ఖాన్‌, రణ్‌వీర్ సింగ్, దిశా పటానీ, అలియా భట్‌ అభిమాన నటులు. 

ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆమెకు ఖాతాలు లేవు.

టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ రికార్డు

T20WC..విదేశీ జట్లలో మనోళ్లు!

భారత్ - పాక్‌ మ్యాచ్ రికార్డులివే..

Eenadu.net Home