‘చికెన్‌ సుక్కా’ అంటే నాకు ప్రాణం!

‘కేజీయఫ్‌’ సినిమాలతో అలరించిన శ్రీనిధి శెట్టి.. తెలుగులో రెండో సినిమా ఓకే చేసింది. 

‘హిట్‌ 3’లో నాని సరసన శ్రీనిధి నటిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. శైలేశ్‌ కొలను తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా ఆన్‌సెట్స్‌ వీడియో ఒకటి లీక్‌ అవ్వడంతో ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత టీమ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వడం గమనార్హం.

సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ‘తెలుసు కదా’లోనూ శ్రీనిధి నటిస్తోంది. 

2022లో విక్రమ్‌ సరసన ‘కోబ్రా’ అనే తమిళ చిత్రంతో తొలిసారి తమిళ తెరపై కనిపించింది. రెండేళ్ల తర్వాత తెలుగు సినిమాల్లోకి వస్తోంది. 

చేసింది మూడే సినిమాలు అయినా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాలో 52లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

మంగళూరులో 1992లో పుట్టిన శ్రీనిధి బెంగళూరులోని జైన్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది.

ఉద్యోగం చేస్తున్న సమయంలో మోడలింగ్‌ చేసింది. ఆ తర్వాత అందాల పోటీల్లోనూ పాల్గొంది.

2016లో యమహా ఫసీనో మిస్‌ దివా టైటిల్‌ను గెలుచుకుంది. ఆశా భట్‌ తర్వాత భారత్‌ నుంచి ఈ కిరీటాన్ని అందుకున్న రెండో మహిళ ఈమే.

పిజ్జా, బిర్యానీతో పాటు మంగళూరు ఫేమస్‌ డిష్‌ ‘చికెన్‌ సుక్కా’ అంటే ఇష్టపడుతుంది. షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణెకు వీరాభిమాని.  

‘నీకు విజయం కావాలంటే దాని కోసం పోరాడు, సాధన చెయ్యి. అంతే కానీ విజయం నిన్ను వరించే వరకూ చూస్తూ కూర్చోవద్దు’ అనే మాటను నమ్ముతుంది, ఆచరిస్తుంది.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home