నాజూకు నాయికలు.. వీళ్ల ఫిట్‌నెస్ సూత్రాలివే!
శిల్పాశెట్టి
నాలుగు పదుల వయసులోనూ ఇంత నాజుగ్గా ఉండటానికి రహస్యమేమంటే.. వారాన్ని మూడు భాగాలుగా విభజించి.. యోగా, ప్రాణాయామం, జిమ్ వర్కౌట్లు చేస్తోంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం, కలబంద రసాన్ని తీసుకుంటోంది.
image:instagram
రష్మికా మందనా
బద్ధకాన్ని వదిలిపెట్టేందుకు రోజూ జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేస్తుందట. అందమైన నవ్వుతో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. క్రమం తప్పకుండా డ్యాన్స్ సాధన చేసినా అద్భుతమైన శరీరాకృతి సొంతమవుతుందని చెబుతోంది.
image:instagram
ప్రియాంకా చోప్రా
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక ఇప్పటికీ తన గ్లామర్‌ని ఏ మాత్రం తగ్గనివ్వట్లేదు. కఠినమైన డైట్ ప్లాన్, జిమ్ వర్కౌట్లతో అందంగా ఉంటోంది. స్విమ్మింగ్ చేయటం వల్ల పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుందని, ఫిట్‌గా ఉంటామని అంటోంది.
image:instagram
సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత హార్డ్ వర్క్‌కి పెట్టింది పేరు. తన పూర్తి శరీరాన్ని శ్రమ పెట్టేలా రోప్ వర్కౌట్, వెయిట్ లిఫ్టింగ్, యోగా చేస్తుంటుంది.
image:instagram
This browser does not support the video element.
రకుల్‌ప్రీత్ సింగ్
శరీరాన్ని, మనసుని దృఢంగా ఉంచుకోవాలంటే యోగానే సరైన ఆయుధం అంటోంది రకుల్. ఇది కాకుండా కిక్ బాక్సింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్ చేయటం తనకి చాలా ఇష్టమంటోంది.
source: instagram
దీపికా పదుకొణె
బాలీవుడ్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోన్న మరో బ్యూటీ దీపికా. ఫిట్‌గా ఉండేందుకు చక్కటి డైట్ ప్లాన్ పాటిస్తూ.. క్రమంతప్పకుండా ఉదయం వాకింగ్, పుష్‌అప్స్, యోగా, వెయిట్‌లిఫ్టింగ్ చేస్తుంటుందట.
image:instagram
This browser does not support the video element.
ఆలియా భట్
ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఆలియా తగ్గేదేలే అంటూ ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తోంది. యోగా, డ్యాన్స్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి ఎక్కువగా చేస్తుంటుంది.
source: instagram
సోనాక్షిసిన్హా
సోనాక్షి అల్పాహారంలో ఓ గ్లాసు పచ్చి పాలు తప్పనిసరిగా ఉండాలట. రోజూ తాజా పండ్లు, కూరగాయలతో కూడిన చక్కటి డైట్ ప్లాన్ అనుసరిస్తూ.. స్విమ్మింగ్, స్పిన్నింగ్‌తో పాటు స్కిప్పింగ్ జాయింట్లకు చక్కటి వ్యాయామాన్ని అందిస్తుందని చెబుతోంది.
image:instagram
This browser does not support the video element.
పూజా హెగ్డే
క్రమం తప్పకుండా చేసే వర్కౌట్లే తన ఫిట్‌నెస్ రహస్యమంటోంది పూజ. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కఠినమైన వ్యాయామాలు చేస్తుంటుంది. మనసుని కేంద్రీకృతం చేయటానికి పూజ ఒంటి కాలిపై నిలబడి ఎక్కువగా సాధన చేస్తుంటుంది.
source: instagram
This browser does not support the video element.
తమన్నా భాటియా
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్ తమన్నా తన షూటింగ్ షెడ్యూల్ ఎలా ఉన్నా వర్కౌట్ మాత్రం తప్పని సరి అంటోంది. వార్మప్‌తో మొదలుపెట్టి యోగా, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి కఠినమైన వ్యాయామాలు చేస్తుందీ మిల్కీ బ్యూటీ.
source: instagram