బాలీవుడ్‌లో వారసుల హవా!
నైసా దేవగణ్
బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ కుమార్తె నైసా దేవగణ్ త్వరలో హీరోయిన్‌గా పరిచయం కానుందట. ప్రస్తుతం బీటౌన్‌లో ఆమె హాట్ టాపిక్‌గా మారింది.
image:kajol/instagram
ఖుషీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి - బోనీ కపూర్ దంపతుల రెండో కుమార్తె ఖుషీ కపూర్ సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ‘ది ఆర్చీస్’ అనే చిత్రంలో నటిస్తోంది.
image:khushi05k/instagram
సుహానా ఖాన్
షారుక్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్.. కూడా ‘ది ఆర్చీస్’తోనే తెరంగేట్రం చేయనుంది. సినిమాల్లోకి రావాలని విదేశాలకు వెళ్లి మరి నటనలో శిక్షణ తీసుకుంది సుహానా.
image:suhanakhan2/instagram
శనయా కపూర్
ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె. శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తోన్న ‘బేధాదక్’లో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడులయ్యే అవకాశముంది.
image:shanayakapoor02/instagram
పాష్మినా రోషన్
సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ కుమార్తె.. హృతిక్ రోషన్‌కి కజిన్. స్టేజ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాష్మినా ఇప్పుడు ‘ఇష్క్ విష్క్ రీబౌండ్’తో తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
image:pashminaroshan/instagram
అలిజా అగ్నిహోత్రి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనకోడలు, దర్శకనిర్మాత అతుల్ అగ్నిహోత్రి కుమార్తె. ఈమె కూడా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనుంది. సల్మానే చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.
image:alizehagnihotri/instagram
షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, చుంకీ పాండే బంధువు అహాన్ పాండే కూడా హీరోలయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్త్య నందా ‘ది ఆర్చీస్’లో నటిస్తున్నాడు.
image: Instagram
ఇప్పటికే శ్రీదేవీ-బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే బాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు.
image: Instagram