భారత్‌ X ఇంగ్లాండ్‌... ఎవరిది పైచేయి?

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా - ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సందర్భంగా గతంలో ఇరు జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Image: Twitter

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు 22 సార్లు ఢీకొన్నాయి. వీటిలో భారత్‌ 12 సార్లు గెలవగా.. ఇంగ్లాండ్‌ 10 సార్లు విజయం సాధించింది.

Image: Rkc

టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు మూడుసార్లు (2007, 2009, 2012) తలపడ్డాయి. అందులో భారత్‌ రెండు, ఇంగ్లాండ్‌ ఒక మ్యాచ్‌ గెలిచాయి.

Image: Rkc 

డర్బన్‌ వేదికగా 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా 218/4 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగి 200/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

Image: Twitter

ఈ మ్యాచ్‌లోనే స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్‌ (58) ఆరు బంతుల్లో ఆరు సిక్సుల రికార్డు సృష్టించాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Image: Rkc

రెండో మ్యాచ్‌.. 2009 ప్రపంచకప్‌లో లార్డ్స్‌ మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తడబడి 150/5 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్‌ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Image: Rkc

ఇక మూడో మ్యాచ్‌.. 2012 ప్రపంచకప్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 170/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 14.4 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటైంది. 

Image: Rkc

ఇంగ్లాండ్‌పై విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 589 పరుగులు చేశాడు. ఇక అత్యధిక వికెట్లు పడగొట్టింది యుజ్వేంద్ర చాహల్‌. 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు.

Image: Rkc

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home