ట్రేడింగ్‌ చేస్తున్నారా? ఈ టిప్స్‌ ఫాలోకండి!

ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్టాక్‌మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన వారు కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. అవేంటంటే..

Image: RKC

స్టాక్‌మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. అందులోని పరిభాషను తెలుసుకోవాలి. స్టాక్స్‌కు సంబంధించిన వార్తలు, వాటిని ప్రభావితం చేసే అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

Image: RKC

మీకంటూ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటికి అనుగుణంగానే ట్రేడింగ్‌ మొదలుపెట్టాలి. అప్పుడే లక్ష్యాన్ని సాధించేవరకు నిబద్ధతతో ఉండగలరు. 

Image: RKC

మొదట్లో చిన్న మొత్తంలో ట్రేడింగ్‌ చేస్తూ పెట్టుబడిలో 1 శాతానికి మించి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆ అనుభవంతో ట్రేడింగ్‌లో అధిక లాభాలు ఆర్జించగలరు. 

Image: Pixabay

ట్రేడింగ్‌లో నిపుణులు, విజయాలు సాధించిన వ్యక్తులు పాటించిన వ్యూహాలను మీరూ గుడ్డిగా అనుసరించకూడదు. కాలాన్ని బట్టి అన్నీ మారుతుంటాయి. కాబట్టి.. వారి వ్యూహాలను అర్థం చేసుకొని మీదైన వ్యూహాలను రచించుకోవాలి. 

Image: RKC

ట్రేడింగ్‌ అనేది డబ్బుతో కూడుకున్నది. స్నేహితులు చెప్పారనో, సోషల్‌మీడియాలో సందేశాలు వస్తున్నాయనో షేర్లను కొనుగోలు చేయకూడదు. వ్యక్తిగతంగా కంపెనీల పనితీరు, వృద్ధిని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. 

Image: RKC

వ్యాపారంలోలాగే ట్రేడింగ్‌లోనూ లాభనష్టాలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. ట్రేడింగ్‌లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు నష్టాలకూ సిద్ధపడాలి. 

Image: RKC

స్టాక్స్‌ను నిత్యం విశ్లేషిస్తూ ఉండాలి. నష్టాల్లో ఉన్నాయని భయపడో, లాభాలు ఉన్నాయని ఆశపడో షేర్లను తొందరపడి అమ్మొద్దు.. కొనుగోలు చేయొద్దు.

Image: Pixabay

ట్రేడింగ్‌లో ఓపిక అవసరం. కొన్నిసార్లు తాత్కాలికంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చినా దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించే అవకాశాలుంటాయి. అలాంటి షేర్లను వదులుకోవద్దు.

Image: Pixabay

పన్ను ఆదా హడావుడిలో ఈ తప్పులొద్దు..

ఏ స్కూటర్‌ రేంజ్‌ ఎంత?

టైటన్‌ ఎస్‌బీఐ కార్డ్‌.. ప్రయోజనాలివే..

Eenadu.net Home