ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

#eenadu

జాన్వీ కపూర్‌..

తన తల్లి శ్రీదేవి ప్రేమతో పేపర్‌పై రాసిచ్చిన ‘ఐ లవ్‌ యూ లబ్బూ’ అనే దాన్ని చేతిపై ముద్రించుకున్నారు.

రష్మిక..

కాలేజీ రోజుల్లో ఒకరిపై ఛాలెంజ్‌ చేసి మరీ Irreplaceable (ప్రతిదీ ప్రత్యేకమే.. దేన్నీ మరో దానితో భర్తీ చేయలేం )టాటూ వేయించుకున్నారు.

ఫరియా అబ్దుల్లా..

కాలిపై చెట్టు వేరుల టాటూ ఉన్న ఈమె.. మనిషికైనా రూట్స్‌ ప్రధానమని పేర్కొన్నారు. 

దీపికా పదుకొణె..

ఈమె మెడపై ‘82°E’ టాటూ ఉంది. దానర్థం 82 డిగ్రీస్‌ ఈస్ట్. అది తాను రన్‌ చేస్తున్న స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ పేరు. 

శ్రద్ధా శ్రీనాథ్‌..

18 ఏళ్ల వయసులో తాను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని, అతడి గుర్తుగా టాటూ వేసుకున్నానని చెప్పారు. 

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..

తన ఛాతీపై ఉన్న పచ్చబొట్టుకు అర్థం ‘సీజ్‌ ది డే’ (రోజుని ఆస్వాదించడం) అని తెలిపారు.

సమంత..

తన కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రమైన ‘ఏమాయ చేసావె’కు షార్ట్‌కట్‌గా YMCని పచ్చబొట్టు పొడిపించుకున్నారట. 

నయనతార..

ఈ నటి చేతిపై ఉన్న టాటూకి మీనింగ్‌ ‘పాజిటివిటీ’ అని కోలీవుడ్ వర్గాల టాక్‌.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home