చిత్రం చెప్పే విశేషాలు..!
(25-12-2022)
చైనాలోని బీజింగ్‌లో ఓ హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు
source : eenadu
ఒడిశాలోని గంజాం జిల్లా గోపాలపూర్ తీర సంబరాల నేపథ్యంలో పూరీకి చెందిన అంతర్జాతీయ శిల్పి సుదర్శన్ పట్నాయక్ భారీ శాంటాక్లాజ్ సైకత శిల్పం ఇసుక, టమాటాలతో 27 అడుగుల ఎత్తున దీనిని తీర్చిదిద్దారు.
source :eenadu
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని కమ్మనపల్లె ఆదర్శ పాఠశాల వద్ద పానీపూరీ విక్రయించే వ్యక్తి విద్యార్థుల నుంచి డబ్బుతో పాటు చిక్కీలను తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. source:ENADU
దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. చిత్రంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్
source :EENADU
ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగింది. పట్టాలు అందుకున్న విద్యార్థులు సందడి చేశారు.
source : EENADU
కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. శనివారం అనకాపల్లి నుంచి విశాఖ నగరంలోని శంకరమఠం వరకు భక్త బృందాలు, ఆధ్యాత్మికవేత్తలు, శిష్య బృందం భారీఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
source :EENADU
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన హైదరాబాద్ కిడ్స్ రన్ ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పరుగులో 1,200 మంది చిన్నారులు పాలుపంచుకున్నారు.
source : EENADU
దేశంలో కరోనా ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కేసులు వెలుగు చూస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం పరీక్షలు ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
source : EENADU