సన్నీ లియోనీ..అందాల విరిబోణి

సన్నీ లియోనీ తెరంగేట్రం చేయడమే పెద్ద సంచలనం. ఓ శృంగార తార వెండితెరపైకి రావడంతో అప్పట్లో వివాదాలు ముసురుకున్నాయి. అయినా తన ప్రతిభతో విమర్శకులను మెప్పిస్తూ హిందీతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది.

Image:Instagram 

తాజాగా ఆమె మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు మంచు మనోజ్‌తో ‘కరెంటు తీగ’లో నటించింది. రాజశేఖర్‌ ‘పీఎస్‌వీ గరుడవేగ’లో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

Image:Instagram

సన్నీ.. 2012లో హిందీ చిత్రం ‘జిస్మ్‌-2’తో వెండితెరకు పరిచయమైంది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. చిత్రసీమలో పాపులారిటీ పెరిగింది.

Image:Instagram

అలా హిందీలోనే కాదు.. తెలుగు, మరాఠీ, పంజాబీ, తమిళ్‌, బెంగాలీ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో.. ప్రత్యేక గీతాల్లో నటిస్తోంది.

Image:Instagram

సన్నీఅసలు పేరు కరణ్‌జిత్‌ కౌర్‌ వోహ్రా. కెనడాలో స్థిరపడ్డ పంజాబీ కుటుంబంలో జన్మించింది.

Image:Instagram

ఆ తర్వాత ఆమె కుటుంబం కాలిఫోర్నియాకి మకాం మార్చింది. అక్కడే చదువు పూర్తి చేసుకున్న సన్నీ.. అడల్ట్స్‌ చిత్రాల్లో నటించి శృంగార తారగా మారింది.

Image:Instagram 

తొలిసారి భారత్‌లో 2005లో నిర్వహించిన ఎంటీవీ అవార్డు కార్యక్రమానికి రిపోర్టర్‌గా పనిచేసింది సన్నీ. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రాల్లో అతిథి, కీలక పాత్రలు పోషించింది.

Image:Instagram 

ఆ తర్వాత 2011లో బాలీవుడ్‌ ‘బిగ్‌బాస్‌ - 5’లో పాల్గొంది. అక్కడే తనకు ‘జిస్మ్‌-2’ అవకాశం లభించింది. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.

Image:Instagram

సన్నీ లియోనీ భర్త డేనియల్‌ వెబర్‌. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో నిషా కౌర్‌ వెబర్‌ను దత్తత తీసుకుంది. ఇద్దరు అబ్బాయిలను సరోగసీ పద్ధతిలో కన్నారు.

Image:Instagram

ఈ బాలీవుడ్‌ బ్యూటీ 2016లో ‘స్వీట్‌ డ్రీమ్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది.

Image:Instagram

సన్నీ.. మంచి అథ్లెట్‌. పలు పోటీల్లో పాల్గొంది. స్ట్రీట్‌ హాకీని అబ్బాయిలతో కలిసి ఆడింది. ఐస్‌ స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టమట.

Image:Instagram

సన్నీ లియోనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 54.3 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home